- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వైద్య మంత్రి ఆఫీస్‌లో ప్రతీరోజూ ర్యాపిడ్ టెస్టులు
దిశ, న్యూస్‌బ్యూరో: నగరంలో కరోనా కేసులు ఇంకా ఎక్కువ సంఖ్యలోనే నమోదవుతున్న నేపథ్యంలో ఎక్కడి నుంచి వస్తూ ఉందో, ఎవరి ద్వారా అంటుకుంటుందో అర్థం కావడంలేదు. దీంతో ముందుజాగ్రత్య చర్యలు తీసుకున్న వైద్య మంత్రి కార్యాలయ అధికారులు ఆ ఆఫీస్‌లో పనిచేసే సిబ్బంది, మంత్రి గన్‌మెన్, డ్రైవర్లు తదితర 30 మందికి ప్రతీరోజు ర్యాపిడ్ టెస్టులు నిర్వహిస్తున్నారు ఆ శాఖ వైద్య సిబ్బంది. ఒకవేళ ఎవరికైనా పాజిటివ్ ఉన్నట్లయితే లక్షణాలేవీ లేకుండానే ఇతరులకు సోకే ప్రమాదం ఉందని భావించి ఈ టెస్టులకు ఉన్నతాధికారులు శ్రీకారం చుట్టారు.
సిబ్బందిలో ఒక్కరికి పాజిటివ్ ఉన్నట్లు తేలినా మిగిలిన ఉద్యోగులంతా క్వారంటైన్‌లోకి వెళ్ళాల్సి ఉంటుందని, ఆ కారణంగా రోజువారీ పనులకు అంతరాయం కలుగుతుందన్న ఉద్దేశంతో మంత్రి సూచనతో ఈ టెస్టులు నిర్వహిస్తున్నట్లు ఓ అధికారి వ్యాఖ్యానించారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో వైద్యారోగ్య శాఖ సిబ్బంది నిర్భయంగా, ఇబ్బంది లేకుండా పనిచేయాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఏ చిన్న పొరపాటు కూడా మొత్తం ఆఫీసు పనులకు ఇబ్బంది కలిగించవద్దన్న ముందుచూపుతోనే ఇందుకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు.
ప్రస్తుతం వైద్యారోగ్య శాఖ, మంత్రి ఆఫీసు తాత్కాలిక సచివాలయమైన బీఆర్‌కేఆర్ భవన్ నుంచి పనిచేస్తున్నాయి. వైద్యారోగ్య శాఖలో గతంలో కొద్దిమంది ఉద్యోగులకు పాజిటివ్ రావడం, ఆ కారణంగా మిగిలిన ఉద్యోగులు క్వారంటైన్‌కు వెళ్ళడం, మరికొద్దిమంది భయంతో వర్క్ ఫ్రం హోమ్ చేయాల్సి రావడం లాంటి పరిస్థితుల్లో రోజువారీ పనులకు జరిగిన సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఈ నిర్ణయం జరిగింది. ఇప్పటికే ఆ భవనంలోని ఆర్థిక శాఖ, మైనారిటీ సంక్షేమ శాఖల్లో పనిచేసే సిబ్బందికి పాజిటివ్ రావడంతో ఏకంగా ఆ బ్లాక్‌లనే మూసేయాల్సి వచ్చింది. ఇది పునరావృతం కాకూడదన్న ఉద్దేశంతోనే ఇప్పుడు వైద్య మంత్రి కార్యాలయంలో ఈ ముందుజాగ్రత్త చర్యలు అమలవుతున్నాయి.