బుల్లితెర నటికి అత్యాచార బెదిరింపులు.. నగ్న ఫోటోలను పంపి..

by Shyam |   ( Updated:2021-07-12 02:15:49.0  )
bengal serial heroine news
X

దిశ, వెబ్‌డెస్క్: సోషల్ మీడియా వచ్చాక సామాన్యులతో పాటు సెలబ్రెటీలకు వేధింపులు తప్పడం లేదు. ఇంకా హీరోయిన్లకైతే లైంగిక వేధింపులు రోజురోజుకూ ఎక్కువైపోతున్నాయి. వారి ఫోటోలను మార్ఫింగ్ చేసి నగ్నంగా, అర్ధనగ్నంగా తయారుచేసి వారికే పంపించి వేధిస్తున్నారు. తాజాగా ఇలాంటి దారుణ పరిస్థితి తనకెదురైందని ఆవేదన వ్యక్తం చేస్తోంది బెంగాలీ బుల్లితెర నటి ప్రత్యూష పాల్‌. బెంగాల్ సీరియల్స్ లో పాపులర్ నటిగా పేరు తెచ్చుకున్న ప్రత్యూషకు సైబర్‌ వేధింపులు ఎదురయ్యాయి. దీంతో ఆమె కోల్ కత్తా పోలీసులను ఆశ్రయించింది. తన ఫేస్ ని మార్ఫ్ చేసి నగ్న దేహాలకు అంటించిన ఫోటోలను తనకు పంపిస్తూ అత్యాచారం చేస్తామంటూ బెదిరిస్తున్నారని ఫిర్యాదులో తెలిపింది.

ఈ విషయం గురించి ఆమె మాట్లాడుతూ ” సోషల్ మీడియాలో గతేడాది జూలైలో ఓ అకౌంట్ నుంచి నాకు కొన్ని మెసేజ్ లు వచ్చాయి. అందులో చాలా అసభ్యకరమైన ఫోటోలు, మాటలు ఉండడంతో ఆ అకౌంట్ ని బ్లాక్ చేశాను. అయితే ఇలాంటి వాటిని పెద్దగా పట్టించుకోనవసరం లేదని మొదట్లో లైట్‌ తీసుకున్నా. కానీ ఆ అకౌంట్ నుండి మెసేజ్ లు రావడం మాత్రం ఆగలేదు. రాను రాను చాలా నీచమైన భాషలో నన్ను వర్ణించడం, నా ఫోటోలను మార్ఫింగ్ చేసి పంపించడం మొదలు పెట్టాడు. ఇప్పటివరకు అతనిని 30 సార్లు బ్లాక్ చేశాను. అయినా సరే అతడు ఆగలేదు. మరో కొత్త అకౌంట్ తో నన్ను వేధించడం మొదలుపెట్టాడు. ఇక ఇటీవల నాపై అత్యాచారం చేస్తానంటూ కొన్ని నగ్న ఫోటోలను పంపి నీచంగా మాట్లాడాడు. ఇక ఈ వేధింపులను తట్టుకోలేక పోలీసులను ఆశ్రయించాను. దయచేసి అతనిని పట్టుకోమంటూ” పోలీసులను కోరింది. నటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Next Story

Most Viewed