చిన్నారి పాలిట శాపమైన చాక్లెట్

by Sridhar Babu |   ( Updated:2021-04-05 02:56:15.0  )
చిన్నారి పాలిట శాపమైన చాక్లెట్
X

దిశ, సిరిసిల్ల: సిరిసిల్ల జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. చాక్లెట్ ఆశ చూపి అభం శుభం తెలియని మూడేళ్ళ చిన్నారిపై 30 ఏళ్ల కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే… సిరిసిల్ల అర్బన్ పరిధి భూపతి నగర్ లో నివాసం ఉంటున్న బూర్ల చంద్రశేఖర్ మర మగ్గాల ఆసామి. అతడి భార్య, పిల్లలు శుభకార్యానికి వెళ్లారు. ఇంట్లో ఒక్కడే ఉండగా… స్థానికంగా నివసించే దంపతుల మూడేళ్ల కూతురు ఆడుకుంటూ కనిపించింది.

చంద్రశేఖర్ ఆ చిన్నారికి చాక్లెట్ ఇస్తానని ఆశ చూపి ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఏడుస్తూ ఇంటికి తిరిగొచ్చిన చిన్నారిని తల్లిదండ్రులు ఏమైందని అడిగారు. చిన్నారి నుండి సమాధానం లేదు. వారు ఆమెకు తీవ్ర రక్తస్రావం కావడాన్ని గమనించారు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. అత్యాచారం జరిగినట్లు వైద్యులు నిర్ధారించారు. తల్లిదండ్రులు సిరిసిల్ల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడు అత్యాచారం చేసినట్లు అంగీకరించాడని పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed