భవిష్యవాణి.. అమ్మవారు ఏం చెప్పారంటే?

by Anukaran |   ( Updated:2021-07-26 00:39:07.0  )
Rangam Bhavishyavani 2021
X

దిశ, వెబ్‌డెస్క్ : బోనాల ఉత్సవాల్లో భాగంగా సికింద్రాబాద్ మహంకాళి ఆలయంలో రంగం కార్యక్రమం నిర్వహించారు. మాతంగి పచ్చికుండపై నిలబడి తనలోకి అమ్మవారిని ఆవహించుకొని భవిష్యవాణి చెప్పడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో స్వర్ణలత భవిష్యవాణి చెప్పింది. భక్తులు మహమ్మారి వలన ఇబ్బందులు పడినా నన్నునమ్మి పూజలు జరిపించినందుకు సంతోషం వ్యక్తం చేసింది. మహమ్మారి బారిన పడి నాకు పూజలు చేసినందుకు సంతోషంగా ఉంది. ప్రజలకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటానన్నారు.

ప్రజలు కొంత ఇబ్బందులు పడుతున్నారని, వర్షాల వల్ల రైతులు కూడా ఇబ్బందులు పడుతారన్నారు. అయినా భయపడొద్దని తాను కాపాడుతానన్నారు. ప్రజలు ధైర్యంగా ఉండాలని సూచించారు. అమ్మకు ఇంత చేసినం..మాకు ఏమి చేయలేదు అనుకోకూడదు, ఎంతటి ఆపద వచ్చినా నేను తొలిగిస్తానని చెప్పారు. అలానే అక్కడ ఉన్న పండితులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. గత సంవత్సరం బోనాలు కార్యక్రమం నిర్వహించలేదు.. ఈ సారి బోనాలు, పూజలు సమర్పించినందుకు సంతోషంగా ఉందా తల్లి అని అడగగా, దానికి సమాధనంగా అమ్మవారు ఎంత ఇబ్బంది పెట్టినా..తనను నమ్మి పూజలు జరిపించినందుకు సంతోషంగా ఉందని, భక్తులందరికీ నా ఆశీర్వాదం ఉంటుందని భవిష్యవాణి చెప్పింది.

Advertisement

Next Story

Most Viewed