అత్యంత ధనవంతులైన ఎమ్మెల్యేల లిస్ట్ లో ఈయన కూడా ఉన్నారంట..!

by Shamantha N |   ( Updated:2021-09-26 07:22:38.0  )
అత్యంత ధనవంతులైన ఎమ్మెల్యేల లిస్ట్ లో ఈయన కూడా ఉన్నారంట..!
X

దిశ, వెబ్ డెస్క్: పంజాబ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నీ ఆధ్వర్యంలో కొత్త కేబినెట్ కొలువుదీరింది. ఈ కేబినెట్ లో కొత్తవారికి కూడా అవకాశం దక్కింది. అదేవిధంగా పలువురికి మరోసారి మంత్రిగా అవకాశం దక్కింది. ఆదివారం గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ వారిచేత మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయించారు. అయితే, మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసినవారి లిస్ట్ లో రాణా గుర్జీత్ సింగ్ కూడా ఉన్నారు. ఈయన అవినీతి ఆరోపణలు ఎదుర్కొని గత ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కేబినెట్ నుంచి బర్తరఫ్ అయ్యారు. అత్యంత ధనవంతుల్లో ఎమ్మెల్యేలల్లో ఈయనొకరని సమాచారం. గతంలో బర్తరఫ్ అయిన ఈయనను చరణ్ జిత్ సింగ్ కేబినెట్ లోకి తీసుకోవడంపై ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Next Story