ప్రమాద హెచ్చరిక : రామప్ప చెరువు సందర్శనకు బ్రేక్..

by Shyam |
ramappa
X

దిశ, ములుగు : ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని రామప్ప చెరువులో వరద ప్రవాహం అంతకంతకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో చెరువు సందర్శనతో పాటు అందులో బోటింగ్ నిషేధిస్తున్నట్లు తహసీల్దార్ మంజుల శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో గత మూడ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మండలంలోని పాలంపేట గ్రామంలో రామప్ప సరస్సు నీటిమట్టం 33.2 ఫీట్లకు చేరుకుందన్నారు.

ప్రస్తుతం వరద ప్రవాహం ఇంకా కొనసాగుతున్నందున పర్యాటకుల సందర్శనతో పాటు బోటింగ్ నిషేధించామన్నారు. నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరుకుంటున్నందున ఎలాంటి ప్రాణనష్టం సంభవించకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఈ మేరకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. కావున, దయచేసి ప్రజలు కూడా అధికారులకు, పోలీసులకు సహకరించాలని కోరారు.

Advertisement

Next Story

Most Viewed