- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మరో బాంబ్ పేల్చిన వర్మ.. శ్మశానంలో అర్ధరాత్రి ఆ పని చేస్తా.. అందుకే ఇలా ఉన్నా
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ లో వివాదస్పద డైరెక్టర్ ఎవరు అంటే టక్కున రామ్ గోపాల్ వర్మ అని చెప్పేస్తారు. ఎప్పటికప్పుడు కొత్తకొత్త వివాదాలతో తెరపైకి వచ్చే వర్మ కొండా అనే చిత్రంతో మరోసారి వార్తల్లో నిలిచిన విషయం తెల్సిందే. అంతేకాకుండా మా ఎన్నికలపై సంచలన వ్యాఖ్యలు చేసి ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచాడు. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూ లో వర్మ తన ఆరోగ్య రహస్యాన్ని వెల్లడించాడు. ప్రస్తుతం అదికూడా నెట్టింట వైరల్ గా మారింది.
మీరు ఎప్పుడు ఆరోగ్యంగా ఉండడానికి కారణమేంటని యాంకర్ అడుగగా వర్మ మాట్లాడూతూ “నేను శ్మశానంలో అర్ధరాత్రి క్షుద్రపూజలు చేస్తాను.. క్షుద్ర దేవతల నుంచి కొన్ని వరాలను పొందాను కాబట్టే ఇంత అందంగా ఉన్నాను, నా ఆరోగ్యానికి, అందానికి కారణం క్షుద్రపూజలు” అని చెప్పుకొచ్చాడు. ఆ పూజలు చేయబట్టే తానెప్పుడూ ఎనర్జిటిక్ గా ఉంటానని తెలిపాడు. దీంతో ఒక్కసారిగా యాంకర్ ఖంగుతిన్నది. శ్మశానంలో క్షుద్రపూజలు అంటే నరబలులు ఇవ్వడం కాదని, అర్ధరాత్రి ఒంటరిగా స్మశానంలోని ఒక మర్రిచెట్టు కింద కూర్చొని వాటి ఆకులవైపే చూస్తూ ఉండిపోతాను.. అలా వాటితో మాట్లాడి, మసాజ్ వంటివి చేయించుకుంటాను. నేను దేవుని నమ్మను కాబట్టే.. నేను దయ్యాన్ని పూజిస్తాను అని చెప్పుకొచ్చాడు. దెయ్యంతో తానెప్పుడో ప్రేమలో పడిపోయానని, అదంటే తనకు భక్తి అని చెప్పుకొచ్చాడు. ఏదిఏమైనా వర్మ ఏమి మాట్లాడినా సంచలనమే అని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.
- Tags
- interview