- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మెగా అనౌన్స్‌మెంట్: ‘Acharya’ విడుదల అప్పుడే
దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి, సెన్సేషనల్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదల కోసం మెగా ఫ్యాన్స్ మాత్రమే కాకుండా.. రెండు రాష్ట్రాల సినిమా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా.. ఈ చిత్రం నుంచి ఫ్యాన్స్‌కి కిక్ ఇచ్చేలా యూనిట్ ఓ బిగ్ అనౌన్స్‌మెంట్ చేసింది. ఈ చిత్రాన్ని 2022 ఫిబ్రవరి 4వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
ఈ విషయాన్ని మెగా పవర్ స్టార్ Ram Charan Tej ట్విట్టర్ ఖాతా ద్వారా శనివారం వెల్లడించారు. అంతేగాకుండా.. ఈ చిత్రంలో చిరంజీవి, రామ్ చరణ్ తొలిసారి కలిసి నటిస్తోన్న సినిమా కావడంతో ఈ సినిమా కోసం ఫ్యాన్స్ కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన విషయం తెలిసిందే. శ్రీమతి సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
#Acharya Arrives on 4th Feb22@KonidelaPro @MatineeEnt @KChiruTweets #SivaKoratala pic.twitter.com/VeE9p7PLrg
— Ram Charan (@AlwaysRamCharan) October 9, 2021