షూటింగ్‌కు రకుల్ రీఎంట్రీ

by Sridhar Babu |   ( Updated:2023-12-15 17:07:04.0  )
షూటింగ్‌కు రకుల్ రీఎంట్రీ
X

దిశ, వెబ్‌డెస్క్: వికారాబాద్ జిల్లాలో సినిమా సందడి నెలకొంది. అందాల తార రకుల్ ప్రీత్ సింగ్ ప్రకృతి అందాలను మించి కట్టిపడేస్తోంది. క్రిష్ దర్శకత్వంలో పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం జిల్లాలో కొనసాగింది. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రంలో యవ హీరో వైష్ణవ్ తేజ్, రకుల్ హీరోహిరోయిన్లుగా నట్టిస్తున్నారు. శనివారం వికారాబాద్ మండలంలోని మదనపల్లిలో తేజ్, రకుల్‌పై పాట చిత్రీకరించారు. కాగా ఈ చిత్ర యూనిట్ గతంలోనే అనంతగిరి అడవుల్లో చిత్రీకరణ ప్రారంభించారు. అయితే బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ ఆత్మహత్య, డ్రగ్స్ కేసు బయటకు రావడం.. డ్రగ్స్ కేసులో రకుల్ పేరు తెర మీదికి రావడంతో ఆమె షూటింగ్‌కు విరామం ఇచ్చి కేసు విచారణకు హాజరైంది. అధికారులకు తన వాదనలు వినిపించిన రకుల్.. తిరిగి హైదరాబాద్‌కు వచ్చింది. తాజాగా శనివారం జరిగిన షూటింగ్‌లో పాల్గొన్నది.

Advertisement

Next Story