- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రకృతి హెచ్చరిక… భూమికి సరెండర్ అవుదాం : రకుల్
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ … ఆరోగ్యం పై ఎక్కువ శ్రద్ధ చూపిస్తుంది. రోజూ వ్యాయామం చేస్తే చక్కని ఆరోగ్యం మీ సొంతమని చెప్తుంది. ఈ క్రమంలో తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఎన్నో సూచనలు, సలహాలు కూడా ఇస్తుంది. కేవలం వ్యాయామం మాత్రమే కాదు… ఆరోగ్యమైన జీవితానికి మంచి ఆహారం కూడా ముఖ్యం అంటూ… ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి… ఎలాంటి విటమిన్లు, ప్రోటీన్లు ఉన్న ఆహారం ప్రిఫర్ చేయాలి.. ఎలా తయారు చేయాలన్న విషయాలను తెలుపుతూ ఈ మధ్యే ఓ యుట్యూబ్ చానెల్ కూడా స్టార్ట్ చేసింది. తద్వారా వచ్చిన మొత్తం డబ్బును పీఎం కేర్స్ ఫండ్ కు ఇవ్వనున్నట్లు తెలిపి ప్రశంసలు అందుకుంది. అంతే కాదు కరోనా కారణంగా జీవనోపాధి కోల్పోయి తిండి లేక బాధపడుతున్న కూలీలకు రోజూ భోజనం కూడా అందించే ఏర్పాట్లు చేసింది.
అయితే అసలు కరోనా లాంటి వైరస్ లు మనల్ని ఇంత బాధపెడుతున్నాయి అంటే దానికి మనమే కారణం అంటోంది అందాల భామ రకుల్. భూమిని మన చేతుల్లోకి తీసుకోవడం వల్లే… ప్రకృతికి విరుద్ధంగా ప్రవర్తించడం వల్లే… ఇన్ని ఘోరాలు జరుగుతున్నాయని అభిప్రాయపడింది. వరల్డ్ ఎర్త్ డే ను పురస్కరించుకుని సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టిన రకుల్… మిమ్మల్ని మీరు కనుగొనాలి అంటే ప్రకృతి అందాల్లోకి వెళ్లి ఆస్వాదించాలని తెలిపింది. మనందరికీ ఆహారాన్ని అందించే భూ గ్రహాన్ని పోషించేంత బాధ్యత నిజంగా మనకు లేదు. ఈ విషయాన్ని గ్రహించి మంచి పౌరులుగా మారేందుకు ప్రయత్నిస్తున్న సమయం ఇది. మనకు పాఠాలు నేర్పేందుకు ప్రకృతికి తన మార్గాలు తనకున్నాయి. అందులో ఇది కూడా ఒకటి. బహుశా మనల్ని మనం కాపాడుకునేందుకు ప్రకృతి ఇస్తున్న హెచ్చరిక అనుకుంటా. కాబట్టి ఎర్త్ ఇంటెలిజెన్స్ కు మనల్ని మనం సరెండర్ చేసుకుంటే… ఈ భూమిపై చెట్ల వేర్లలా పాతుకుపోతామని అభిప్రాయపడింది రకుల్. హ్యాపీ ఎర్త్ డే విషెస్ తెలుపుతూ… బాధ్యతగా ఉండాలని కోరింది.