- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యూట్యూబ్ లో రకుల్ కుకింగ్ లెస్సన్స్
దిశ, వెబ్‌డెస్క్: రకుల్ ప్రీత్ సింగ్… సౌత్ ఇండస్ట్రీతో పాటు హిందీలో మంచి గుర్తింపు పొందిన భామ. సోషల్ మీడియాలో ఎప్పుడూ ఆరోగ్య సూత్రాల గురించి చెప్పే భామ… వర్కౌట్, యోగా గురించి ఎప్పటికప్పుడు క్లాస్ ఇస్తూనే ఉంటుంది. మానవశరీరానికి ఎక్సర్సైజ్ ఎంత ముఖ్యమో… ఆహారం కూడా అంతే ముఖ్యమని సూచిస్తోంది. అందుకే యూట్యూబ్ చానల్ స్టార్ట్ చేసి ఆరోగ్యకరమైన ఆహారాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసేందుకు నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని మంగళవారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా వెల్లడించింది రకుల్.
ఎప్పటి నుంచో ఈ పని చేయాలనుకున్నా టైం సరిపోలేదని తెలిపిన భామ…. లాక్ డౌన్ కారణంగా దొరికిన సమయంలో ఈ పని చేస్తున్నందుకు సంతోషంగా ఉందని చెప్పింది. ఈ యూ ట్యూబ్ చానల్ ద్వారా వచ్చిన మొత్తం డబ్బును పీఎం కేర్స్ ఫండ్‌కు అందిస్తానని తెలిపింది. కరోనా మహమ్మారి విజృంబిస్తున్న తరుణంలో సంతోషాన్ని, ప్రేమను పంచాలని కోరింది. మరింత మార్పు కోసం తన యూట్యూబ్ చానల్‌ను సబ్ స్కైబ్ చేయాలని కోరింది రకుల్. కాగా తొలి వీడియోలో పాన్ కేక్స్ చేసి చూపించింది భామ. ఇప్పటికే రకుల్ 200 పేద కుటుంబాలకు ఆహారాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే.