- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
జులై 31 నుంచి అసెంబ్లీ నిర్వహించండి: గెహ్లాట్
జైపూర్: అసెంబ్లీని సమావేశాలను నిర్వహించాలని రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్ గవర్నర్ కల్‌రాజ్ మిశ్రాకు మరోసారి ప్రతిపాదించారు. సమావేశాలకు ఎజెండాగా బలపరీక్ష కాకుండా కరోనా పరిస్థితులపై చర్చ, సమీక్ష అంటూ సీఎం పేర్కొన్నారు. ఈ నెల 31 నుంచి సమావేశాలను నిర్వహించాలని కోరారు. ఈ ప్రతిపాదనలో బలపరీక్ష అనే పదమే లేదు.
అయితే, తన మద్దతుదారులు సచిన్ పైలట్ వర్గం గురుగ్రామ్‌లోని ఓ హోటల్‌లో నిర్బంధించిందని, వారు తిరిగి వచ్చాక సర్కారు బలం మరింత పెరుగుతుందని పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాలు నిర్వహించకుండా గవర్నర్‌పై పైనుంచి ఒత్తిళ్లు వస్తున్నాయని శుక్రవారం సీఎం ఆరోపించిన సంగతి తెలిసిందే. అసెంబ్లీని సమావేశపరచాలని అదేరోజు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సీఎం గెహ్లాట్ రాజ్‌భవన్‌లో సుమారు ఐదు గంటలపాటు ధర్నా చేశారు. అనంతరం సీఎం ప్రతిపాదించిన లేఖలో సమావేశాల నిర్వహణకు తేదీ, ఎజెండా, కారణాలు పేర్కొనలేదని, క్యాబినెట్ ఆమోదమూ లేదని గవర్నర్ లేవనెత్తారు. తాజాగా, గవర్నర్ లేవనెత్తిన ఆరు అంశాలపై చర్చించి మరోసారి సీఎం ప్రతిపాదన లేఖను ఆయనకు అందించారు.