- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేడు కార్గిల్ విజయ్ దివస్.. ఎందుకు జరుపుకుంటారు?
దిశ, వెబ్ డెస్క్: నేడు విజయ్ దివస్. కార్గిల్ యుద్ధంలో మన దేశం విజయం సాధించిన రోజు. భారత సైనికుల శౌర్యపతాపాలకు ప్రతీక ఈరోజు. 21 సంవత్సరాల క్రితం 1999 జూలై 26న భారత సైనికులు పాకిస్థాన్ సైన్యానికి గట్టిగా బుద్ధి చెప్పిన రోజు ఈ రోజు. ఈ సందర్భంగా ఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్ వద్ద కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
కాగా, కార్గిల్ విజయ్ దివస్ విషయానికి వస్తే.. 1999 మే 3న కార్గిల్ ప్రాంతంలోకి పాకిస్థాన్ సైన్యం, ఉగ్రవాదులు అక్రమంగా చొరబడ్డారు. అలా వచ్చినవారు ఆ చుట్టుపక్కల కస్కర్, ముష్కో, ద్రాస్ సెక్టార్లలోకి చొరబడి తమ ఆధీనంలోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. ఇది గమనించిన భారత సైన్యం అలర్ట్ అయ్యి ఈ విషయాన్ని వెంటనే కేంద్ర ప్రభుత్వానికి విషయం తెలిపింది. కానీ, కేంద్ర ప్రభుత్వం ఇందుకు సంబంధించి ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. కానీ, పాకిస్థాన్ బలగాలు మాత్రం ఇంకా చొచ్చుకొచ్చాయి.
దీంతో కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆదేశాలు జారీ చేసింది. అనంతరం పాక్ సైన్యానికి గట్టి ఎదురు దెబ్బ తగిలేలా భారత సైన్యం గగనతలం నుంచి భారీగా దాడులు చేసింది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్.. మా సైన్యం చొరబడలేదు.. భారత సైన్యం అక్రమంగా వైమానిక దాడులు చేసిందంటూ ఖండిస్తూ పలు వ్యాఖ్యలు చేసింది. ఇది తెలుసుకున్న భారత ప్రభుత్వం.. పాక్ చొరబాటుకు సంబంధించిన వాస్తవాలతో కూడిన డాక్యుమెంట్లు, ఇతర అంశాలను రిలీజ్ చేసింది. దీంతో పాకిస్థాన్ కు అంతర్జాతీయంగా ఎదురుదెబ్బ తగిలింది.
ఈ క్రమంలో 1999 జూలై 4న భారత్-పాకిస్థాన్ బలగాల మధ్య భారీ ఎదురు కాల్పులు జరిగాయి. సుమారు 11 గంటలపాటు ఈ ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో పాక్ సైన్యం తోకముడవక తప్పలేదు. ఈ సమయంలో కొంతమంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పాయారు. అదేవిధంగా బతాలిక్ ను కూడా భారత్ సైన్యం దక్కించుకుంది. ఇలా ఆ సమయంలో పాక్ సైన్యంతో జరిగిన యుద్ధంలో భారత సైన్యం వరుస విజయాలు సాధించి పాక్ సైన్యాన్ని మన గడ్డపై నుంచి తరిమి తరిమి కొట్టింది. దీంతో 1999 జూలై 26న ఆపరేషన్ విజయం సాధించినట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది. దీంతో దేశవ్యాప్తంగా సంబరాలు జరుపుకున్నారు. అదేవిధంగా అప్పటి నుంచి జూలై 26ను కార్గిల్ విజయ్ దివస్ గా జరుపుకుంటున్నాం. అదేవిధంగా కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందిన భారత జవాన్లను స్మరిస్తూ నివాళులర్పిస్తూ వస్తున్నాం.