బాలీవుడ్‌కు 'హిట్'

by Shyam |   ( Updated:2020-07-15 02:40:02.0  )
బాలీవుడ్‌కు హిట్
X

హిట్ (HIT).. హోమీసైడ్ ఇంటర్వెన్షన్ టీమ్. యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘హిట్’ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. నేచురల్ స్టార్ నాని నిర్మించిన ఈ చిత్రానికి శైలేష్ కొలను దర్శకుడు కాగా.. వ్యక్తిగత విషాదంతో బాధపడుతున్న విక్రమ్ అనే పోలీస్ ఆఫీసర్.. తప్పిపోయిన అమ్మాయి కేసు ఇన్వెస్టిగేషన్‌లో తెలుసుకున్న నిజాలేంటి? ఎందుకు పానిక్ అటాక్స్ జరుగుతున్నాయనేది కథ. కాగా, దీనికి సీక్వెల్ కూడా ఉన్నట్లు ప్రకటించారు దర్శకులు.

అంతేకాదు ఈ సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. రాజ్ కుమార్ రావు హీరో కాగా, తెలుగు సినిమాను డైరెక్ట్ చేసిన శైలేష్ కొలను.. హిందీ వెర్షన్ కూడా డైరెక్ట్ చేయనున్నారు. దిల్ రాజు, కుల్ దీప్ రాథోడ్ నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న సినిమా షూటింగ్ 2021లో ప్రారంభం కానుంది.

Advertisement

Next Story