- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పంజాబ్‌పై రాజస్థాన్ ఘన విజయం
దిశ, వెబ్‌డెస్క్: అబుదాబి వేదికగా జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం సాధించింది. పంజాబ్ నిర్ధేశించిన భారీ స్కోర్‌ను సునాయాసంగా చేధించి, మ్యాచ్ కైవసం చేసుకుంది. పంజాబ్ నిర్ధేశించిన 185 పరుగుల లక్ష్యాన్ని 17.03 ఓవర్లో మూడు వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసి, పంజాబ్‌కు చెమటలు పట్టించింది. అయితే ఈ మ్యాచ్‌లో బెన్ స్టోక్స్ 26 బంతుల్లో 50 పరుగులు చేశాడు. అనంతరం రాబిన్ ఉతప్ప 23 బంతుల్లో 30 పరుగులు చేసి వెనుదిరిగాడు. మూడో వికెట్‌గా బరిలోకి దిగిన సంజూ శాంసన్ 25 బంతుల్లో 48 పరుగులు చేసి, మెరుపు ఇన్నింగ్స్ ఆడి రనౌట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన స్టీవ్ స్మిత్, జాస్ బట్లర్ మ్యాచ్‌ను ముగించి, గెలుపును ఖాతాలో వేసుకున్నాడు.
పంజాబ్ ఇన్నింగ్స్: ఐపీఎల్ 50వ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ భారీ స్కోర్ నమోదు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. తొలుత ఓపెనింగ్ వచ్చిన కేఎల్ రాహుల్ తొలి బంతిని ఎదుర్కొని సింగిల్ తీశాడు. కానీ, తొలి బంతికే మందీప్ శర్మ తొలి డకౌట్ అయ్యాడు. దీంతో పంజాబ్ 1 పరుగుకే 1 వికెట్‌ను కోల్పోయింది. ఇక బ్యాట్స్‌మెన్లను రాజస్తాన్ బౌలర్లు ఒత్తిడి నెడుతున్న సమయంలో వన్‌డౌన్‌లో వచ్చిన యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ సత్తాచాటాడు. వరుస బౌండరీలను పారిస్తూ బౌలర్లకు వణుకుపుట్టించాడు. దీనికి తోడు కేఎల్ రాహుల్ కూడా బ్యాట్‌కు పని చెప్పాడు.
కెప్టెన్ కేఎల్ రాహుల్ 41 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 46 పరుగులు చేశాడు. 121 పరుగుల వద్ద స్టోక్స్ బౌలింగ్ షాట్‌కు ప్రయత్నించిన రాహుల్ క్యాచ్ అవుట్ అయ్యాడు. దీంతో 121 పరుగుల నష్టానికి పంజాబ్ రెండు వికెట్ల కోల్పోయింది. ఇక ఆ తర్వాత వచ్చిన నికోలస్ పూరన్ ఉన్న కాసేపు అయిన మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 10 బంతుల్లో 3 సిక్సర్లతో 22 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.
యూనివర్స్ బాస్ ఇజ్ బ్యాక్:
రాజస్తాన్ బౌలర్లకు క్రిస్ గేల్ చుక్కలు చూపించాడు. తొలి నుంచి సమిష్టిగా రాణిస్తూ అదును చూసి బౌండరీలు బాదాడు. ఐపీఎల్‌లో మరోసారి తన ప్రతిభను కనబర్చాడు. మొత్తం 63 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్సర్లతో 99 పరుగులు చేశాడు, కానీ, చివరి ఓవర్‌లో ఆర్చర్ వేసిన బంతికి సెంచరీ చేయబోయే ప్రయత్నంలో బంతి బ్యాట్‌కు తాకి వికెట్లకు తాకింది. దీంతో 1 పరుగుతో తేడాతో సెంచరీ మిస్ అయింది. ఈ నేపథ్యంలో క్రిస్ గేల్ తీవ్ర నిరుత్సాహనికి గురయ్యాడు. అయినప్పటికి 99 పరుగుల స్కోర్‌తో జట్టు స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లాడు. ఇక ఆ తర్వాత వచ్చిన గ్లెన్ మ్యాక్స్‌వెల్ (6), దీపక్ హుడా(1) పరుగుతో నాటౌట్‌గా నిలిచారు. దీంతో పంజాబ్ 185 పరుగులు చేసింది.
స్కోరు బోర్డు:
Kings XI Punjab Innings: 185-4 (20 Ov)
1. కేఎల్ రాహుల్ (c) (wk)c రాహుల్ తెవాతియా b స్టోక్స్ 46(41)
2. మందీప్ సింగ్ c స్టోక్స్ b జోఫ్రా ఆర్చర్ 0(1)
3. క్రిస్ గేల్ b జోఫ్రా ఆర్చర్ 99(63)
4. నికోలస్ పూరన్ c రాహుల్ తెవాతియా b స్టోక్స్ 22(10)
5. గ్లెన్ మ్యాక్స్‌వెల్ నాటౌట్ 6(6)
6. దీపక్ హుడా నాటౌట్ 1(1)
ఎక్స్‌ట్రాలు: 11
మొత్తం స్కోరు: 185
వికెట్ల పతనం: 1-1 (మందీప్ సింగ్, 0.6), 121-2 (కేఎల్ రాహుల్, 14.4) 162-3 (నికోలస్, 17.6), 184-4 (క్రిస్ గేల్, 19.4)
బౌలింగ్:
1. జోఫ్రా ఆర్చర్ 4-0-26-2
2. వరుణ్ ఆరోన్ 4-0-47-0
3. కార్తీక్ త్యాగి 4-0-47-0
4. శ్రేయస్ గోపాల్ 1-0-10-0
5. బెన్ స్టోక్స్ 4-0-32-2
6. రాహుల్ తెవాతియా 3-0-22-0
Rajasthan Royals Innings:
1. రాబిన్ ఉతప్పా c పూరన్ b ఎం అశ్విన్ 30(23)
2. బెన్ స్టోక్స్ c దీపక్ హుడా b క్రిస్ జోర్డాన్ 50(26)
3. సంజు సామ్సన్ (wk) రనౌట్ సుచిత్ 48(25)
ఎక్స్‌ట్రాలు: 5
మొత్తం స్కోరు: 186
వికెట్ల పతనం: 60-1 (బెన్ స్టోక్స్, 5.3), 111-2 (రాబిన్ ఉతప్ప, 10.5), 145-3 (సంజు సామ్సన్, 14.2) బి
బౌలింగ్:
1. అర్ష్‌దీప్ సింగ్ 3-0-34-0
2. మహ్మద్ షమీ 3-0-36-0
3. మురుగన్ అశ్విన్ 4-0-43-1
4. క్రిస్ జోర్డాన్ 3.3-0-44-1
5. రవి బిష్ణోయ్ 4-0-27-0