Xiaomi Pad 7: షావోమీ కొత్త ప్యాడ్ 7..ధర, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే

by Bhoopathi Nagaiah |
Xiaomi Pad 7: షావోమీ కొత్త ప్యాడ్ 7..ధర, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే
X

దిశ, వెబ్‌డెస్క్: చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీ షావోమీ (Xiaomi)మార్కెట్లో సత్తాచాటుతోంది. ఎప్పటికప్పుడు సరికొత్త అప్ డేట్ ఫీచర్లతో ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ను డిజైన్ చేస్తూ మార్కెట్లోకి లాంచ్ చేస్తోంది. దీంతో షావోమీ ప్రొడక్టులకు ఫుల్ డిమాండ్ ఏర్పడుతోంది. తాజాగా ఇప్పుడు మరో కొత్త ప్యాడ్ (New pad)ను లాంచ్ చేసింది. అద్బుతమైన ఫీచర్లతో షావోమీ ప్యాడ్ 7 (Xiaomi Pad 7) భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఏఐ ఫీచర్లు(AI Features), స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ తో డిజైన్ చేసిన ఈ కొత్త ప్యాడ్ కస్టమర్లను బాగా ఆకట్టుకుంటోంది. మరి షావోమీ ప్యాడ్ 7 (Xiaomi Pad 7)ధర..ఫీచర్ల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

షావోమీ(Xiaomi) ప్యాడ్ 7 ధర:

ఈ షావోమీ (Xiaomi) టాబ్లెట్ మూడు స్టోరేజ్ వేరియంట్‌లలో వస్తుంది. 8GB RAM + 128GB, 8GB RAM + 256GB, 12GB RAM + 256GB. దీని బేస్ వేరియంట్ ధర రూ.26,999. అయితే ఇతర రెండు వేరియంట్లు వరుసగా రూ. 29,999, రూ. 31,999 ఉంది. ఈ టాబ్లెట్‌ను ఇ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్‌తో పాటు కంపెనీ అధికారిక స్టోర్ నుండి కొనుగోలు చేయవచ్చు. టాబ్లెట్ కొనుగోలుపై తక్షణ బ్యాంక్ తగ్గింపు రూ. 1,000 అందుబాటులో ఉంటుంది.

షావోమీ (Xiaomi) ప్యాడ్ 7 ఫీచర్లు:

Xiaomi Pad 7 11.2 అంగుళాల LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ టాబ్లెట్ డిస్‌ప్లే 3K రిజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. అదనంగా, ఈ టాబ్లెట్‌లో HDR10, డాల్బీ విజన్‌ కూడా ఉంటుంది. దీని డిస్‌ప్లే బ్రైట్ నెస్ 800 నిట్‌ల వరకు ఉంటుంది.

ఈ టాబ్లెట్ Qualcomm Snapdragon 7+ Gen 3 ప్రాసెసర్‌లో రన్ అవుతుంది. ఇది 12GB RAM, 256GB వరకు ఇంటర్నల్ స్టోరేజీకి సపోర్టు చేస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 15 ఆధారంగా హైపర్‌ఓఎస్ 2లో రన్ అవుతుంది. ప్యాడ్ 7 8,850mAh పవర్ ఫుల్ బ్యాటరీని కలిగి ఉంది. దీన్ని ఛార్జ్ చేయడానికి 45W USB టైప్ C వైర్డ్ ఛార్జింగ్ ఫీచర్‌కు సపోర్టు చేస్తుంది. ఈ టాబ్లెట్ బ్యాక్ సైడ్ 13MP కెమెరాతోపాటు.. 8MP సెల్ఫీ కెమెరా ఇందులో ఉంది. సెల్ఫీ ప్రియులకు బాగుంటుందని చెప్పవచ్చు. అడ్వాన్స్డ్ ఫీచర్లు కావాలనుకునేవారు షావోమీ పై ఓ లుక్కేయ్యండి.

అంతేకాదు Xiaomi ఈ టాబ్లెట్‌తో Focus Keyboardని పరిచయం చేసింది. దీని ధర రూ.4,999. ఈ కీబోర్డ్ టచ్‌ప్యాడ్‌తో వస్తుంది. దీన్ని సులభంగా నావిగేట్ చేయవచ్చు. ఇది మాత్రమే కాదు, దీనితో పాటు ఫోకస్ పెన్ కూడా ప్రారంభించింది దీని ధర రూ. 5,999గా ఉంది.

Next Story