ఫీల్డింగ్ ఎంచుకున్న రాజస్తాన్

by Shyam |   ( Updated:2020-09-27 12:34:55.0  )
ఫీల్డింగ్ ఎంచుకున్న రాజస్తాన్
X

దిశ, వెబ్‌డెస్క్: షార్జా క్రికెట్ స్టేడియం వేదికగా ఐపీఎల్‌ 9వ మ్యాచ్‌ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. కింగ్స్‌ ఎలెవన్ పంజాబ్ వర్సెస్ రాజస్తాన్ రాయల్స్ మధ్య జరిగే మ్యాచ్‌ బిగ్ ఫైట్‌ను తలపిస్తోంది. ఎందుకంటే ఓ సంచలన బ్యాట్స్‌మెన్ ఈ మ్యాచ్‌తోనే బరిలోకి దిగుతున్నాడు. ఇది కాక పంజాబ్, రాజస్తాన్‌ జట్లల్లో హార్డ్ హిట్టర్స్ ఉండటంతో మ్యాచ్ నువ్వా-నేనా అన్న రీతిలో సాగనుంది. మ్యాచ్‌లో భాగంగా టాస్ గెలిచిన రాజస్తాన్ బౌలింగ్ ఎంచుకుంది.

ముఖ్యంగా మొన్నటి మ్యాచ్‌లో బెంగళూరుకు చుక్కలు చూపించిన కేఎల్ రాహుల్ ఆట పైనే అందరి దృష్టి ఉంది. అటు రాజస్తాన్‌‌ జట్టులో యంగ్ బ్యాట్స్‌మెన్ సంజూ శాంసన్.. ఈ మ్యాచ్‌తోనే ఐపీఎల్‌లో అడుగుపెట్టిన జోస్ బట్లర్‌ పైన అంచనాలు ఎక్కువే ఉన్నాయి. ఇంతటి హార్డ్ హిట్టర్స్ ఉన్నటువంటి పంజాబ్-రాజస్తాన్ మ్యాచ్ బిగ్ ఫైట్‌ను తలపించనుంది.

Advertisement

Next Story