- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
Minister Nimmala:‘మన రైతు-మన రామానాయుడు’ కార్యక్రమంలో మంత్రి.. కీలక వ్యాఖ్యలు

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గత ప్రభుత్వ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ(సోమవారం) పశ్చిమ గోదావరి జిల్లా పోడూరులో మన రైతు మన రామానాయుడు కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. ఈ క్రమంలో రూ.కోటితో అభివృద్ధి పనులకు మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పంట కాల్వలు, డ్రైన్ల పనులకు రూపాయి కూడా ఖర్చు పెట్టలేదని విమర్శించారు. ఇక గుండ్లకమ్మ, అన్నమయ్య ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోయినా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
గత ప్రభుత్వ పాలనతో రాష్ట్రం ఆర్థికంగా నష్టపోయిందని అన్నారు. కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి పెట్టిందని అన్నారు. సీఎం చంద్రబాబు పరిపాలనా దక్షతను ఆర్థిక సంఘం ప్రతినిధులు ప్రశంసించారని మంత్రి నిమ్మల తెలిపారు. ఇక నిన్న రాష్ట్రంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మంత్రి నిమ్మల మెగా డీఎస్సీ వయోపరిమితి 42 నుంచి 44 పెంచారని తెలిపారు. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ధర్మారపు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంత్రి నిమ్మల 1000 మంది డీఎస్సీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ అందిస్తున్నారు. దీంతో శిక్షణ కేంద్రంలో డీఎస్సీ అభ్యర్థులు కేక్ కట్ చేసి సంబురాలు చేసుకున్నారు.