- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ప్రమాదంలో ఉద్యోగులు..."శాలరీ" వ్యవస్థ అంతరించిపోనుందా ?

దిశ, వెబ్ డెస్క్: టెక్నాలజీ మారినా కొద్దీ... ప్రపంచం మొత్తం మారిపోతుంది. ముఖ్యంగా ఉపాధి విషయంలో... సమూల మార్పులు జరుగుతున్నాయి. మనుషుల పనులు... మిషన్లే చేసేస్తున్నాయి. దీంతో... నిరుద్యోగ రేటు.. విపరీతంగా పెరగడమే కాకుండా... ఆర్థిక వ్యవస్థలో పెను ప్రకంపనలు చోటుచేసుకుంటున్నాయి. అటు పేదరికం కూడా విపరీతంగా పెరిగిపోతుంది.
డేంజర్ బెల్స్ మోగిస్తున్న AI
ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే పేరు మాత్రమే వినిపిస్తోంది. ఈ టెక్నాలజీ వినియోగించుకొని... అన్ని పనులు చేసేసుకుంటున్నారు. అసలు హ్యూమన్ ఫోర్స్ లేకుండానే ఏ ఐ టెక్నాలజీ... అన్ని పనులను క్షణాల్లో చేసేస్తోంది. 1000 మంది ఎంతో కష్టపడి చేయాల్సిన పనిని చిటికలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ( Artificial Intelligence).. చేస్తోంది. మనుషుల కంటే కచ్చితంగా పనిచేయడం, విరామం లేకుండా పనిచేయడం, శాలరీ ( Salary ) తీసుకోకుండా శ్రమించడం లాంటివి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ముఖ్య లక్షణాలు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మంచి సెక్యూరిటీ కూడా లభిస్తుంది. పెండింగ్ వర్కును... అది తక్కువ కాలంలో పూర్తి చేయడం కూడా చేస్తోంది. దీనివల్ల ఉన్న ఉద్యోగాలు కూడా పోతున్నాయి. చాలామంది ఉన్నత శ్రేణి ఉద్యోగులు రోడ్డున పడుతున్నారు. అలా ఉద్యోగులు ఒక్కొక్కరు బయటికి వెళ్తే... మొత్తం ఏ ఐ టెక్నాలజీ కబ్జా చేయడం గ్యారంటీ.
శాలరీ వ్యవస్థ అంతరించిపోనుందా ?
భవిష్యత్తు కాలంలో... ఉద్యోగుల సంఖ్య తగ్గి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం పెరుగుతుందని చాలామంది పారిశ్రామికవేత్తలు చెబుతున్నారు. బిల్ గేట్స్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ఏఐ టెక్నాలజీ విపరీతంగా వాడితే.. ఉద్యోగులను పీకి పడేయడం గ్యారంటీ. అలా చేస్తే... నిరుద్యోగుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. శాలరీ వ్యవస్థ కూడా... పూర్తిగా అంతరించి పోనుంది. ఇదే విషయాన్ని తాజాగా ప్రముఖ పారిశ్రామికవేత్త సౌరబ్ ముఖర్జీయ ( Saurabh Mukherjea ) కూడా వెల్లడించారు. ఓ పాడ్ కాస్ట్ లో ఆయన మాట్లాడుతూ... షాకింగ్ నిజాలు బయటపెట్టారు. భారతదేశం కొత్త ఆర్థిక యుగంలోకి ప్రవేశిస్తుందని ప్రకటించారు. జీతం కోసం కాకుండా ప్రయోజనాల కోసం పనిచేసే రోజులు రాబోతున్నాయని కూడా ఆయన వెల్లడించారు. చదువు ఒక్కటే సరిపోదు.. వందలాది మంది పనిచేసే పనిని ఏఐ క్షణాల్లో చేసేస్తుందని వివరించారు. ఎవరికి గ్యారెంటీ లేదని కూడా ఆయన వెల్లడించారు. ఇండియాలో దశాబ్దాలుగా మధ్యతరగతి వారికి ఆర్థికంగా అండగా నిలిచిన శాలరీ వ్యవస్థ కూడా కనుమరుగయ్యే ప్రమాదం పొంచి ఉందని సౌరవ్ ముఖర్జీయా ప్రకటన చేశారు. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.