- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Music effects : అందరికీ నచ్చాలనేం లేదు.. ఆ సందర్భాల్లో మ్యూజిక్ కూడా చిరాకు తెప్పిస్తుంది!

దిశ, ఫీచర్స్ : తమకు నచ్చింది అందరికీ నచ్చుతుందని అనుకుంటారు కొందరు. తాము మెచ్చింది అందరూ మెచ్చుతారని భ్రమ పడుతుంటారు మరి కొందరు. కానీ.. అలా అనుకోవడం అవగాహనా రాహిత్యమని, అజ్ఞానికి నిదర్శనమని నిపుణులు అంటుంటారు. ఎందుకంటే.. ఈ ప్రపంచంలో ఒక్కొక్కరి టేస్ట్ ఒక్కోలా ఉంటుంది. ఒక్కొక్కరి హాబీస్ ఒక్కోలా ఉంటాయి. ఒక్కొక్కరి పరిస్థితులు ఒక్కోలా ఉంటాయి. మ్యూజిక్ విషయంలోనూ సరిగ్గా అదే జరుగుతుందని తాజా అధ్యయనం వెల్లడించింది. ఆ వివరాలేంటో చూద్దామా
ఆ క్షణం ఫీలింగ్ ఏంటంటే..
బస్సులోనో, ట్రైన్‌లోనో జర్నీ చేస్తుంటాం.. పక్కనే కూర్చున్న మరో వ్యక్తి స్మార్ట్‌ఫోన్‌లో సౌండ్ పెద్దగా పెట్టి మ్యూజిక్ ఎంజాయ్ చేస్తుంటాడు. హావ భావాలు ఒలికిస్తూ తెగ ఎంజాయ్ చేస్తుంటాడు. తనకు వినసొంపైన ఆ సంగీతం, ఇతరులు కూడా వినాలని భావిస్తుంటాడు. కానీ పక్కనున్న వారి ఫీలింగ్ ఏంటో తెలుసా? ‘వీడెక్కడి పిచ్చోడ్రా బాబూ’ అనుకుంటారు. లాగిపెట్టి కొట్టాలన్నంత కోపం వచ్చినా పోనీలే అని సర్దుకు పోతుంటారు. అందుకే బ్రో.. నీకు తెలిసిందే సర్వస్వం అనుకోకు. నీకు నచ్చింది అందరికీ నచ్చుతుందని భ్రమ పడకు !
వర్క్ ప్లేస్‌లో మరో తలనొప్పి
ముందే అనుకున్నాంగా.. అందరి టేస్టూ ఒకేలా ఉండదని.. కానీ అది అర్థం కాదు కొందరికి. చుట్టు పక్కల ఇతరులు పనిచేసుకుంటున్నారన్న సోయి కూడా ఉండదు. చేతిలో ఫోన్ ఉంది కదా అని శ్రావ్యమైన సంగీతమంటూ.. హీలింగ్ మ్యూజిక్ వినండంటూ తమకు నచ్చినవి వింటూ ఇతరులకు వినిపించే ప్రయత్నం చేస్తుంటారు. ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వాళ్లంతట వాళ్లు వింటే పర్లేదు. కానీ.. తమ పైత్యం పక్కనోళ్లకు కూడా అంటించే ప్రయత్నం చేస్తారు. ఇక్కడే అవతలి వ్యక్తికి చిరాకు పుడుతుంది. కాకపోతే పరిచయస్తులనో, ఫీలవుతారనో వద్దని వారించలేరు. అలాగని భరించనూ లేరు. ఎటూ తేల్చుకోలేక తెగ ఇబ్బంది పడుతుంటారు లోలోన. పైగా అది పనికి ఆటంకం కలిగిస్తుంది. ఏకాగ్రతను దెబ్బతీస్తుంది. ప్రొడక్టివిటీ తగ్గుదలకు కారణం అవుతుంది. అందుకే ఆఫీసులో డిగ్నిటీగా ఉండాలంటారు నిపుణులు.
అధ్యయనాలు ఏం చెబుతున్నాయ్..
సంగీతం ఓ అద్భుతం.. అది మీలో ఆనందాన్ని కలిగిస్తుందని గత అధ్యయనాలు పేర్కొన్నాయి. అయితే అది అందరికీ వర్తిస్తుందనుకుంటే పొరపాటే అని తాజా అధ్యయనం పేర్కొన్నది. అది ఎంత మంచి మ్యూజిక్ అయినా నచ్చినప్పుడు మాత్రమే మానసిక ఆనందాన్ని, ఆరోగ్యాన్ని కలిగిస్తుందని, నచ్చకపోతే చిరాకు తెప్పించి పరోక్షంగా అనారోగ్యానికి దారితీస్తుందని ఓహియో స్టేట్ యూనివర్సిటీ (Ohio State University) పరిశోధకుల రీసెంట్ స్టడీ వెల్లడించింది. ఇందులో భాగంగా వారు వివిధ వర్క్‌ప్లేస్‌లో పనిచేసే 13.5 మిలియన్ల మందికి పైగా ఉద్యోగులను ప్రశ్నించి, ఫలితాలను విశ్లేషించారు. ఒకరికి నచ్చిన సంగీతం మరొకరికి నచ్చనప్పుడు చిరాకు తెప్పించడం, ఏకాగ్రత, ప్రొడక్టివిటీ తగ్గడం వంటివి సంభవించాయని గుర్తించారు. అందుకే ఏ విషయాన్నీ ఒకే కోణంలో చూడొద్దని, అనేక అంశాలను, ఆయా వ్యక్తులను ఆసక్తులను కూడా పరిగణనలోకి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.