ఐపీఎల్‌కు పాకిన కరోనా.. కోచ్‌కు పాజిటివ్

by  |
ఐపీఎల్‌కు పాకిన కరోనా.. కోచ్‌కు పాజిటివ్
X

దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్ 13వ సీజన్‌(IPL 13th season)కు కరోనా(Corona) సెగ తాకింది. రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) జట్టు ఫీల్డింగ్ కోచ్ యాగ్నిక్‌(Fielding Coach Yagnik)కు కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆయన సెల్ఫ్ ఐసోలేషన్‌(Self Isolation)కు వెళ్లిపోయారు. మరోవైపు కోచ్‌తో సన్నిహితంగా మెలిగిన వ్యక్తులూ క్వారంటైన్‌కు వెళ్లాలని ఫ్రాంచైజీ యాజమాన్యం(Franchise ownership) కోరింది.

ప్రస్తుతం జట్టులోని మిగతా సభ్యులంతా క్షేమంగా ఉన్నట్లు వెల్లడించింది. కాగా, సెప్టెంబర్ 19నుంచి యూఏఈలో ఐపీఎల్(IPL) ప్రారంభం కానుండగా, మరో పదిరోజుల్లో ఫ్రాంచైజీలు(Franchises) అక్కడకు చేరుకోవాల్సి ఉంది. యూఏఈ బయలుదేరకముందే జట్టు సభ్యులు, సిబ్బందికి రెండు సార్లు కొవిడ్ పరీక్ష(Kovid test)లు నిర్వహించనున్నారు. వీటిలో నెగిటెవ్‌ వస్తేనే వారిని యూఏఈ ప్రయాణానికి అనుమతిస్తామని బీసీసీఐ(BCCI) ఇప్పటికే తెలిపింది. రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) జట్టు సభ్యులంతా వచ్చే వారం ముంబైలో ఏర్పాటు చేసిన శిబిరానికి రావాల్సి ఉండగా జట్టు ఫీల్డింగ్ కోచ్ దిశాంత్ యాగ్నిక్‌(Dishant Yagnik)కు పాజిటివ్‌గా తేలడం దిగ్భ్రాంతికి గురి చేసింది.


Next Story

Most Viewed