వీడియో విడుదల.. అందులో సచిన్ లేడు!

by Anukaran |   ( Updated:2020-07-14 00:19:49.0  )
వీడియో విడుదల.. అందులో సచిన్ లేడు!
X

జైపూర్: సొంత ప్రభుత్వంపై తిరుగుబావుటా ఎగురవేసిన రాజస్థాన్ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ గురించి తాజాగా మరో విషయంపై చర్చ జరుగుతోంది. తన వర్గం ఎమ్మెల్యేలతో కూడిన ఓ వీడియోను విడుదల చేశారు. తద్వారా ఆయన తన బలాన్ని చూపేందుకు ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. ఈ వీడియోను సచిన్ కార్యాలయం నుంచి విడుదల చేసినట్లు ఓ వార్తా సంస్థ పేర్కొన్నది. సుమారు 15 మంది ఎమ్మెల్యేలు ఆ వీడియోలో ఉన్నట్లు అర్థమవుతోంది. ప్రస్తుతం వీరు హరియాణాలోని మానేసర్ లో ఉన్న ఓ రిసార్టులో మకాం వేసినట్లు తెలుస్తోంది. అయితే.. ఆ వీడియోలో మాత్రం పైలట్ సచిన్ మాత్రం కనిపించకపోవడం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed