- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్వీయ నిర్బంధంలోకి వసుంధరరాజే, దుష్యంత్
రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధరరాజే, ఆమె కుమారు దుష్యంత్ సింగ్ స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. తాము కలిసిన సింగర్ కనీకా కపూర్ కు కోవిడ్ -19 సోకటంతో వారు ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. లక్నోలో జరిగిన ఓ కార్యక్రమానికి మాజీ సీఎం వసుంధరరాజే, తన కుమారుడు దుష్యంత్ తో కలిసి వెళ్లింది. ఈ కార్యక్రమంలో భాగంగా గాయని కనీకాకపూర్ ను వారు కలిశారు. దీంతో ముందు జాగ్రత్తగా చర్యగా వారు స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. ఆ పార్టీలో పాల్గొన్నవారందరూ స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. కనీక కపూర్ మార్చి 9న లండన్ నుంచి ముంబై వచ్చింది. రెండు రోజుల తర్వాత లక్నో వెళ్లింది. తాజాగా ఆమెకు కరోనా వైరస్ సోకినట్టు తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్టు చేసింది. కాగా తన అనారోగ్యాన్ని దాచి చాలా మంది ప్రముఖలను ఇబ్బంది పెట్టినందుకు కనీకపై కేసు నమోదైంది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ స్పందించారు. కనీకతోపాటు ఆ కార్యక్రమంలో పాల్గొన్న వారి వివరాలను 24 గంటల్లోగా సేకరించాలని అధికారులను ఆదేశించారు.
Tags: corona virus, singer kanika kapoor, quarantine ex cm vasundhara raje, her son dushyanth