- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చెర్రీ, ఎన్టీఆర్ లకు సవాల్ విసిరిన రాజమౌళి
దిశ వెబ్ డెస్క్: లాక్డౌన్ కారణంగా ప్రజలందరూ ఇంటికే పరిమితమయ్యారు. అందులోనూ సెలబ్రిటీస్ అయితే పూర్తిగా ఇంటి పనులతో బిజీ అయిపోయారు. ఇంట్లోనే ఉంటూ భార్యలకు ఇంటిపనుల్లో సాయం చేస్తున్నారు. అంతేకాదు చాలా మంది నలభీముడిలా గరిటె తిప్పేస్తూ… మంచి మంచి వంటకాలను చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇంటిపనుల్లో భార్యలకు సాయం చేసే వీడియోను పోస్ట్ చేయాలంటూ.. అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా… దర్శకధీరుడు రాజమౌళికి ఆదివారం ఛాలెంజ్ విసిరారు. చాలెంజ్ ను స్వీకరించిన రాజమౌళి దాన్ని పూర్తి చేసి ట్విటర్ లో పోస్ట్ చేశారు. అంతేకాదు రాంచరణ్, ఎన్టీఆర్ లకు ఈ చాలెంజ్ విసిరారు. రాబోయే రోజుల్లో ఈ చాలెంజ్ ఇలా ఎంతమంది సెలబ్రిటీలకు చాలెంజ్ గా మారుతుందో!
సందీప్ రెడ్డి సవాల్ ను సాదరంగా స్వీకరించిన రాజమౌళి తనకు ఇచ్చిన మాట ప్రకారం సోమవారం టాస్క్ పూర్తి చేశాడు. తన భార్య రమా రాజమౌళికి ఇంటి పనుల్లో సాయం చేస్తున్న ఓ వీడియోను ట్విట్టర్ వేదికగా షేర్ చేశాడు జక్కన్న. చేతిలో చీపురు పట్టుకున్న జక్కన్న.. ఇంట్లోని గదులను, తలుపులను, కిటికీలను శుభ్రం చేశాడు. ఈ ట్వీట్ సోషల్ మీడియా వైరల్ అవుతోంది. ‘సందీప్ నువ్వు ఇచ్చిన టాస్క్ పూర్తి చేశాను. రామ్ చరణ్, ఎన్టీఆర్ లకు ఈ చాలెంజ్ విసురుతున్నాను. వారితో పాటు సుకుమార్, శోభు యార్లగడ్డ, పెద్దన్న కీరవాణి’లు కూడా ఈ సవాల్ విసురుతున్నాను అని ట్వీట్ చేశాడు.
tags :rajamouli, rama rajamouli, sandeep reddy vanga, ntr, ram charan