రైజింగ్ స్టార్ ‘రసిక దుగ్గల్’

by Shyam |
రైజింగ్ స్టార్ ‘రసిక దుగ్గల్’
X

దిశ, వెబ్‌డెస్క్ : వస్తున్న అవకాశాలను అందిపుచ్చుకుంటూ, ఏదో ఒకరోజు ఇండస్ట్రీ తనవైపు చూసే రోజులు తప్పకుండా వస్తాయని బలంగా నమ్మిన నటి రసిక దుగ్గల్. అనుకున్నట్లుగానే ఇప్పుడు బీటౌన్‌లో ఆమెకు చాన్స్‌లు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం వెబ్ సిరీస్‌లు, సినిమా అవకాశాలతో బిజీగా మారిన పవర్‌హౌజ్ యాక్టర్ రసిక.. లీడింగ్ రోల్స్‌కు కేరాఫ్‌గా నిలుస్తోంది.

జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌లో జన్మించిన రసిక దుగ్గల్.. 2007 నుంచి బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తోంది. ‘అన్వర్’ చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. హై ప్రొఫైల్ టీవీ డ్రామాలు, విన్నింగ్ వెబ్ సిరీస్‌లలో అవకాశాలు దక్కించుకుని ఇప్పటికే మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ‘ఏ సూటబుల్ బాయ్, ఢిల్లీ క్రైమ్, మిర్జాపూర్’ సిరీస్‌ల్లో రసిక నటనకు అందరూ ఫిదా అయిపోయారు. ఇక ‘మిర్జాపూర్ 2’లో తన నటన మరో లెవల్ అనే చెప్పాలి. ఇటీవలే ఓటీటీలో విడుదలైన ‘లూట్ కేస్’ చిత్రంలోనూ మరో డిఫరెంట్ రోల్‌తో ప్రేక్షకులను అలరించిన రసిక.. ఇప్పుడు వెబ్ సిరీస్‌‌ల్లో లీడింగ్ రోల్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ‘మీర్జాపూర్ 3’ సిరీస్‌లోనూ మరోసారి తన నట విశ్వరూపాన్ని చూపించడానికి రసిక సిద్ధమైంది. అటు బాలీవుడ్‌లోనూ తను నటిస్తోన్న ‘దర్బాన్’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.

‘ఓటీటీ వచ్చిన తర్వాత చాలా మార్పులు వచ్చాయి. వీటిల్లో స్ట్రీమ్ అవుతున్న వెబ్ సిరీస్‌ల్లో నటించేందుకు ‘స్టార్స్’ మాత్రమే కావాలనే రూల్ ఏం లేదు. గుడ్ కంటెంట్ ఉంటే చాలు.. ప్రేక్షకులు ఆ సిరీస్‌ను సక్సెస్ చేస్తున్నారు. సినిమాకైనా, సిరీస్‌కైనా ఫైనల్ జడ్జిమెంట్ ప్రేక్షకులదే. ఇదివరకు మేము ఒకే ఫార్మూలాకు అతుక్కుపోయాం. కానీ కొన్ని సంవత్సరాల నుంచి ఆ ఫార్ములాను బ్రేక్ చేశాం. ఇప్పటికే ఎన్నో వెబ్ సిరీస్‌లు ఆ మార్పును చూపించాయి. ప్రేక్షకులు కోరుకున్న మంచి కంటెంట్ వారికి అందిస్తున్నాం. మిర్జాపూర్, మేడ్ ఇన్ హెవెన్ రెండు భిన్నమైన జానర్స్. కానీ ఆ రెండూ హిట్ కొట్టాయి. ఇలాంటి వెరైటీ, గుడ్ కంటెంట్ ప్రేక్షకులు కావాలి’ అని రసిక అభిప్రాయపడింది.

Advertisement

Next Story