ఉత్తరాంధ్రలో వర్షం.. తుపాను ఆరంభమైందా?

by srinivas |   ( Updated:2020-05-06 07:44:13.0  )
ఉత్తరాంధ్రలో వర్షం.. తుపాను ఆరంభమైందా?
X

దిశ బ్యూరో: ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాల్లో గత వారం రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఉదయమంతా తీవ్ర ఎండ, వడగాలులు, ఉక్కపోతతో ఇబ్బంది పెడుతున్న వాతావరణం, మధ్యాహ్నామయ్యే సరికి తీవ్రమైన గాలులు, వానతో విరుచుకుపడుతోంది. ఎంఫాన్ తుపాను ముప్పు ఉందంటూ రెండు రోజుల క్రితం సాక్షాత్తూ సీఎం అధికారులను అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు చేయగా, విశాఖ వాతావరణ కేంద్ర ఎంఫాన్ తుపానుపై ప్రచారమైనవన్నీ పుకార్లని, ఏపీకి తుపాను ముప్పు లేదని ప్రకటించిన సంగతి తెలిసిందే.

దీంతో వ్యవసాయదారులు హర్షం వ్యక్తం చేశారు. అయితే అనుకోని అతిధిలా మరోమారు వర్షాలు కురవడం ఆరంభమైంది. నిన్నటి వరకు ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉరుములు మెరుపులతో వర్షాలు ఆరంభమైతే.. నేటి మధ్యాహ్నం నుంచి ఉరుములు మెరుపులు లేకుండా వర్షం కురవడం ఆరంభమైంది. గంటల తరబడి వర్షం కురుస్తుండడంతో వేసవి కాలం వర్షాకాలంలా అనిపిస్తోంది. తుపాను ప్రారంభమైందా? అన్న అనుమానం వ్యక్తమవుతోంది.

tags: agriculture, raining, rains, crop, unwanted rain

Advertisement

Next Story

Most Viewed