- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నైఋతి రుతుపవనాల విస్తరణ
దిశ, న్యూస్‌బ్యూరో: నైఋతి రుతుపవనాల విస్తరణతో మూడ్రోజులు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సోమ, మంగళ, బుధవారాల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని, బుధవారం పలుచోట్ల భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణశాఖ స్పష్టం చేసింది. మధ్య అరేబియా సముద్రం, గోవా, కొంకన్ ప్రాంతాలు, కర్ణాటక, రాయలసీమలోని కొన్ని ప్రాంతాలు, తమిళనాడు, కోస్తా ఆంధ్రాలో కొన్ని ప్రాంతాలు, మధ్య బంగాళాఖాతం, ఉత్తర బంగాళాఖాతంలో మరి కొన్ని ప్రాంతాలు, ఈశాన్య భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో నైఋతి రుతుపవనాలు రాగల 2 రోజులలో విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. వచ్చే రెండ్రోజుల్లో మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణలోని కొన్ని ప్రాంతాలు కోస్తా ఆంధ్రాలో మరికొన్ని ప్రాంతాలు, బంగాళాఖాతం, ఈశాన్య భారతదేశంలో మిగిలిన ప్రాంతాలు, సిక్కిం, ఒడిశా, పశ్చిమబెంగాల్ ప్రాంతాలకు నైఋతి రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.