హిమాచల్ ప్రదేశ్‌లో తెగిపోయిన జాతీయ రహదారి

by Anukaran |
హిమాచల్ ప్రదేశ్‌లో తెగిపోయిన జాతీయ రహదారి
X

దిశ, వెబ్ డెస్క్: హిమాచల్ ప్రదేశ్ లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. దీంతో అక్కడ జనజీవనం అస్తవ్యస్థమమైంది. గతకొద్ది రోజుల నుంచి ఆ రాష్ట్రంలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నదులు, వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ వరదల ధాటికి జాతీయ రహదారులు సైతం ధ్వంసమయ్యాయి. దీంతో ఆ ప్రాంతాలల్లో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వందలాది గ్రామాలకు రవాణా సౌక్యరం పూర్తిగా నిలిచిపోయింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం సహాయ చర్యలను కొనసాగిస్తున్నది.

కాగా, జమ్మూకాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, గుజరాత్, గోవా, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలల్లో భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ పేర్కొన్నది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. శాటిలైట్ చిత్రాలతో పరిస్థితిని సమీక్షిస్తున్నది.

Advertisement

Next Story

Most Viewed