విజయానికి అవే నాలుగు స్తంభాలు- జయంతి మాల్యా

by Shyam |
విజయానికి అవే నాలుగు స్తంభాలు- జయంతి మాల్యా
X

దిశ, తెలంగాణ బ్యూరో: రైల్వే సిబ్బంది, వారి కుటుంబ సభ్యుల ప్రయోజనాల కోసం నిరంతరం సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని దక్షిణ మధ్య రైల్వే మహిళా సంక్షేమ సంఘం అధ్యక్షురాలు జయంతి మాల్యా స్పష్టం చేశారు. గురువారం లాలాగూడ సెంట్రల్ రైల్వే ఆసుపత్రికి మహిళా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో లెక్చరర్ హాల్ కోసం 50 ఎగ్జిక్యూటివ్ కుర్చీలను, నలభై సాధారణ కుర్చీలను విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కరోనా సమయంలో, సంఘం ఆధ్వర్యంలో పలు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ఏదైనా సంస్థ విజయవంతంగా సాగడానికి వారి కార్యనిర్వహణ నాయకత్వం, మౌలిక సదుపాయాలు, అంకితభావం గల సిబ్బంది ఉండడం ఆ సంస్థకు నాలుగు స్తంభాలాంటివని అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెడికల్ డైరెక్టర్ డాక్టర్ ప్రసన్న కుమార్, డాక్టర్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story