- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్లాక్ మార్కెట్‌లో రైల్వే టికెట్లు
దిశ, తెలంగాణ బ్యూరో : ప్రయాణికుల రిజర్వేషన్ టికెట్ల బ్లాక్ మార్కెటింగ్ అక్రమాలను అరికట్టేందుకు దక్షిణ మధ్య రైల్వే అన్ని ప్రధాన నగరాల్లోని రిజర్వేషన్ కార్యాలయాలు, ట్రావెల్ ఏజెన్సీల్లో బుధవారం ప్రత్యేక తనిఖీలు నిర్వహించింది. ఐజీ ప్రిన్సిపల్ చీఫ్ సెక్యూరిటీ కమిషనర్, ఎస్‌సీఆర్ జీ.ఎమ్.ఈశ్వరరావు పర్యవేక్షణలో రైల్వే రక్షక దళం తనిఖీలు చేపట్టింది. జోన్ పరిధిలో కమీషన్ పద్ధతిన దళారులు బుక్ చేసిన రూ.16,32,643 విలువైన ప్రయాణ టికెట్లు 178, ఉపయోగించిన 1886 టికెట్లు స్వాధీనం చేసుకున్నారు. 36 మంది దళారులను అదుపులోకి తీసుకున్నారు.
ఈ సందర్భంగా ఈశ్వరరావు మాట్లాడుతూ అనుమతి లైసెన్స్ లేకుండా వ్యాపారాలు నిర్వహిస్తున్న దళారుల బ్లాక్ మార్కెటింగ్ నుంచి ప్రయాణికులను రక్షించాలని, రైల్వేకు జరుగుతున్న భారీ నష్టాన్ని అరికట్టాలనే లక్ష్యాలతో ఈ తనిఖీలు చేపట్టామన్నారు. దళారులపై కఠిన చర్యలు తీసుకోవాడానికి ఆర్పీఎఫ్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని తెలిపారు. ప్రయాణికులు అధికారిక వెబ్‌సైట్లు, రిజర్వేషన్ కౌంటర్లు, అధికారిక ట్రావెల్ ఎజెన్సీల నుంచి మాత్రమే టికెట్లు కొనుగోలు చేయాలని కోరారు. అనుమతి లేకుండా ఎవరైనా టికెట్లు అమ్మితే రైల్వే అధికారులకు తెలియజేయాలని కోరారు.