మరో 100 రైళ్లకు రైల్వే శాఖ కసరత్తు

by  |
మరో 100 రైళ్లకు రైల్వే శాఖ కసరత్తు
X

దిశ, వెబ్ డెస్క్: నాలుగో దశ అన్‌లాక్‌లో రైల్వే శాఖ అదనంగా మరో 100 ప్రత్యేక ట్రైన్‌ల సేవలను అందించడానికి ప్రణాళికలు వేస్తున్నది. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరుపుతున్నది. ప్రస్తుతం సేవలందిస్తున్న సుమారు 230 ట్రైన్‌లలో సగటున 75శాతం ఆక్యుపెన్సీ నమోదవుతున్నందున రైళ్ల సంఖ్యను పెంచాలని నిర్ణయించింది.

ఏ రూట్లలో అదనపు ట్రైన్‌ల సేవలను అందించాలనే విషయంపై జోనల్, డివిజనల్ స్థాయి అధికారులు ప్రణాళికలు వేస్తున్నారని సంబంధితవర్గాలు తెలిపాయి. బీహార్, యూపీ, మహారాష్ట్ర, గుజరాత్‌లలో ఆక్యుపెన్సీ ఎక్కువ నమోదవుతున్నది. కాగా, బీజేపీయేతర పార్టీలు అధికారంలోని రాష్ట్రాలు అదనపు రైళ్లకు సుముఖంగా లేవు.

తమిళనాడు, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు అదనంగా ట్రైన్‌ సేవలను అందించడానికి వెనుకడుగువేస్తున్నాయని కొన్నివర్గాలు వివరించాయి. రైల్వే బోర్డు అధికారులు, జోనల్, డివిజల్ అధికారుల మధ్య ఈ విషయంపై చర్చ జరిగిందని, తుది నిర్ణయం ఇంకా తీసుకోవాల్సి ఉన్నదని పేర్కొన్నాయి.


Next Story

Most Viewed