- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చాలా ఆసక్తిగా ఉంది.. ద్రవిడ్ ఎంట్రీపై కేఎల్ రాహుల్ కామెంట్లు
దిశ, స్పోర్ట్స్: భారత యువ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ మార్గదర్శకత్వంలో ఆడటానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ అన్నాడు. న్యూజీలాండ్‌లో ప్రారంభం కానున్న టీ20 సిరీస్‌కు ముందు రాహుల్ మీడియాతో మాట్లాడాడు. ‘రాహుల్ ద్రవిడ్ నాకు చాలా కాలంగా తెలియడం నా అదృష్టమని భావిస్తున్నాను. యువ క్రికెటర్‌పై అతడి మనసులో ఏమున్నదో నేను తెలుసుకోవడానికి ఇష్టపడతాను. కర్ణాటకలో ఆడే సమయంలో ద్రవిడ్ ఎంతో సహాయం చేశాడు. నాకే కాకుండా దేశంలోని చాలా మంది యువక్రికెటర్లకు దిశానిర్దేశం చేశాడు.
టీమ్ ఇండియాలో అతడు భాగస్వామి కావడం వల్ల మరిన్ని కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం ఉంటుంది. నేను ఇండియా ఏ తరఫున కొన్ని మ్యాచ్‌లు ఆడినప్పుడు ద్రవిడ్ కోచ్‌గా ఉన్నాడు. అతడు ప్రతీ ఆటగాడికి సౌకర్యవంతమైన వాతావరణాన్ని కల్పిస్తాడు. నిజంగా అతడు టీమ్ స్పిరిట్ ఉన్న మనిషి. ఇక రోహిత్ శర్మ టీమ్ ఇండియాను కొత్త దిశలో నడిపిస్తాడని భావిస్తున్నాను. అతడికి సహాయంగా వైస్ కెప్టెన్‌గా ఉండటం సంతోషంగా ఉన్నది. నా పాత్ర ఏమిటో తెలుసుకొని సరైన న్యాయం చేస్తాను’ అని రాహుల్ చెప్పుకొచ్చాడు.