రాహుల్ గాంధీ షాకింగ్ కామెంట్స్.. ‘మోడీ’ ప్రధాని కాదంట..!

by Shamantha N |   ( Updated:2021-08-24 08:18:57.0  )
రాహుల్ గాంధీ షాకింగ్ కామెంట్స్.. ‘మోడీ’ ప్రధాని కాదంట..!
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలోని కీలక ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల విక్రయ ప్రక్రియను కేంద్రం మరోసారి ముందుకు తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం మీడియా ముఖంగా ప్రకటించారు. రూ.6 లక్షల కోట్ల భారీ నిధుల సమీకరణ కోసం పెట్టుబడుల ఉపసంహరణ ఉండనుందని నిర్మలా సీతారామన్ తెలిపారు. అయితే, ఈ విషయంపై కాంగ్రెస్ జాతీయ నేత రాహుల్ గాంధీ మంగళవారం స్పందించారు. ప్రైవేటీకరణకు మేము వ్యతిరేకం కాదన్నారు. కానీ అందులో ఉన్న ‘లాజిక్‌’ను కేంద్రం మిస్సయ్యిందన్నారు.

భారత్‌లో రైల్వేలను మేం కీలక రంగంగా భావించామని రాహుల్ చెప్పుకొచ్చారు. కీలకమైన రైల్వే రంగంలో కొన్ని కోట్ల మంది ప్రయాణించే రైల్వేను ఎందుకు ప్రైవేటీకరించాలని ప్రశ్నించారు. 70 ఏళ్లలో కూడగట్టిన ఆస్తులన్నీ అమ్మేయాలని బీజేపీ నిర్ణయించడం బాధకరమన్నారు. కీలక పరిశ్రమలను ఎప్పుడూ మేం ప్రవేటీకరించలేదన్నారు. మార్కెట్ షేర్ తక్కువగా ఉన్నా, నష్టదాయకంగా ఉన్నా సంస్థలనే ప్రైవేటీకరించామని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. నరేంద్ర మోడీ దేశప్రధాని కంటే.. కార్పొరేట్ సంస్థలకు ఒక పరికరంలా మారారని విమర్శించారు. ఇదిలాఉండగా, కేంద్రంలోని ప్రభుత్వరంగ సంస్థలైన రైల్వే, విమానయానం, రోడ్లు, గ్యాస్ తదితర రంగాల్లో వాటాలను విక్రయించేందుకు మోడీ ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది.

Advertisement

Next Story