- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. మోడీతో పాటు ఎనిమిది మందికి ట్వీట్
దిశ, వెబ్‌డెస్క్ : వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం సృష్టిస్తోంది. ఫ్రెషర్స్ డే సందర్భంగా విద్యార్థుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. కేఎమ్‌సీ కళాశాల విద్యార్థులు ఫ్రేషర్స్ డే సందర్భంగా నాలుగో సంవత్సరం విద్యార్థులను ఆహ్వానించారు. దీంతో ఈ వేడుకలో సుమారు 50 మంది పాల్గొన్నారు. అయితే మూడో సంవత్సరం విద్యార్ధులు తమను గౌరవించడం లేదని, తగిన మర్యాద ఇవ్వడం లేదని సీనియర్లు ఆగ్రహించడంతో జూనియర్ విద్యార్థులు, సీనియర్ విద్యార్థుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో జూనియర్ విద్యార్థులపై సినియర్ విద్యార్థులు అనుచితంగా ప్రవర్తించారు. దీంతో ఓ విద్యార్థి మోడీ, కేటీఆర్‌లతో పాటు మరో 8 మందికి ట్వీట్ చేశాడు. దయచేసి కాపాడండి. వారంతా తప్ప తాగి జూనియర్ మెడికోల పట్ల అనుచితంగా వ్యవ హరిస్తున్నారు. ఇదంతా వరంగల్ కేఎంసీలోని న్యూమెన్స్ హాస్టల్-1లో జరుగుతోందని ట్వీట్ చేశారు. దీంతో పోలీసులు కళాశాలకు చేరుకొని ట్వీట్టర్ ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టారు.