- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అరగంటలో టేస్టీ అండ్ హెల్దీ "రాగిదోశ"
దిశ, వెబ్ డెస్క్: ఆహారంలో రాగులను ఏదొక రూపంలో తరచూ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎక్కువమంది రాగులతో జావ, సంగటి మాత్రమే చేస్తుంటారు. రాగి దోశలు తినాలన్నా బయట దొరికే ఇన్ స్టెంట్ బ్యాటర్ తెచ్చుకుని ఉపయోగిస్తుంటారు. ఇప్పుడు బయట ఫుడ్స్ తినడం మంచిది కాదు కాబట్టి ఇంట్లోనే జస్ట్ అరగంటలో రాగి దోశ ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం.
ముందుగా ఓ బౌల్ తీసుకుని అందులో 2 కప్పుల రాగిపిండిని వేయండి. ఇప్పుడు అందులో నీరు పోసుకుని దోశపిండిలా కలుపుకోండి. కలుపుకున్న దోశ పిండిలోనే ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు తురుము, తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, సరిపడా ఉప్పు వేయండి. ఇప్పుడు అవన్నీ బాగా కలిసేలా ఉండలు కట్టకుండా కలుపుకోండి.
దోశ పాన్ తీసుకుని స్టవ్ పైన మీడియం మంటపై పెట్టి వేడి చేయండి. ఇప్పుడు రాగి పిండిని తీసుకుని దోశలా వేయండి. ఇది మామూలు దోశపిండిలా వేయడానికి కుదరదు. కాబట్టి మీరు దోశ వేసుకునేటప్పుడే పిండిని పాన్ లో దోశ ఆకారంలో (రవ్వ దోశలా) చుట్టూ వేయండి. దోశని నెయ్యి లేదా నూనెతో రెండు వైపులా 3 నుంచి 4 నిమిషాల పాటు కాల్చండి. అంతే హెల్దీ అండ్ టేస్టీ రాగి దోశ రెడీ. ఈ దోశ ఏదైనా చట్నీతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది.