రఘురామ ఫోన్ ఇప్పటికీ అక్కడే ఉంది : ఏపీ సీఐడీ

by srinivas |   ( Updated:2021-06-07 08:37:03.0  )
raghurama krishnam raju
X

దిశ, వెబ్‌డెస్క్ : వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృషరాజును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేసినప్పుడు తన ఫోన్ లాక్కున్నారని ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసింది. అయితే ఈ ఫిర్యాదు పై స్పందించిన సీఐడీ అధికారులు ఎంపీ రఘురామకృష్ణ ఫోన్ నిబంధనల ప్రకారమే సీజ్ చేశామని వెల్లడించారు. సీజ్ చేసిన ఫోన్‌ను సీల్డ్ కవర్లో ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపినట్లు తెలిపారు. ఇప్పటికీ ఆ ఫోన్ ల్యాబ్‌లోనే ఉన్నట్లు వెల్లడించారు. మొబైల్ ఫోన్ గురించి రఘురామ చెప్పిన వివరాలు సరైనవి కావన్నారు. ఈ మొత్తం ఎపిసోడ్‌ను సీరియస్‌గా తీసుకున్న ఏపీ సీఐడీ, ఈ వ్యవహారాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed