షోకాజ్ నోటీసులు చెల్లుతాయా: వైసీపీ ఎంపీ

by srinivas |
షోకాజ్ నోటీసులు చెల్లుతాయా: వైసీపీ ఎంపీ
X

దిశ ఏపీ బ్యూరో: వైఎస్సార్సీపీ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే. ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో ఆయన సమావేశమయ్యారు. తనకు వైఎస్సార్సీపీ పంపిన షోకాజ్ నోటీసులు చెల్లుతాయా? లేదా? అన్న విషయాన్ని చర్చించారు. పార్టీ అసలు పేరు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అయితే పార్టీ లెటర్ హెడ్‌పై కాకుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరిట ఉన్న లెటర్ హెడ్‌పై నోటీసులు వచ్చాయని అధికారులకు చెప్పారు. ఆ నోటీసులు చెల్లుబాటు అవుతాయా? అంటూ ఆరాతీశారు. అంతే కాకుండా ప్రాంతీయ పార్టీ అయన తమ పార్టీ నుంచి వచ్చిన నోటీసులో జాతీయ ప్రధాన కార్యదర్శి పేరిట వచ్చాయని, ప్రాంతీయ పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శి ఎలా ఉంటాడన్న సందేహాన్ని కూడా ఆయన అధికారుల ముందు వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీలో క్రమశిక్షణ సంఘం లేదని, అలాంటి పరిస్థితుల్లో షోకాజ్ నోటీసులను ఎలా చూడాలన్న విషయాన్ని వారి నుంచి తెలుసుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed