- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మనుమనికి మరో పదవి ఇచ్చేవారేమో..
దిశ, దుబ్బాక: రేపు జీహెచ్ఎంసీ ఎన్నికలు అయిన తర్వాత కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేసి హరీశ్ రావు ఉద్యోగాన్ని ఊడపీకే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం పెద్ద చెప్యాల గ్రామంలో ఇంటింటి ప్రచారాన్ని రఘునందన్ రావు సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ బిడ్డ సంవత్సరం ఖాళీగా ఉండటం చూసి తట్టుకోలేక కేసీఆర్ మళ్లీ ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారని అన్నారు. తన ఇంట్లో సరిపోలేదని తన సడ్డకుని కొడుకు సంతోశ్ కు ఎంపీ పదవి ఇచ్చాడాని అన్నారు. ఇంకా 21 సంవత్సరాలు నిండి ఉంటే తన మనుమనికి కూడా ఏదైనా పదవి ఇచ్చేవాడని ఆయన అన్నారు. తెలంగాణ నిరుద్యోగులకు మాత్రం ఆరు సంవత్సరాల పాలనలో ఉద్యోగాలు వేయడం లేదని టీఆర్ఎస్ ప్రభుత్వం పై ఆయన విమర్శలు గుప్పించారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీ ని నెరవేర్చని టీఆర్ఎస్ పార్టీకి దుబ్బాక ఉప ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.