మరక మసకబారాకే టచ్‌లోకి..

by Ramesh Goud |
మరక మసకబారాకే టచ్‌లోకి..
X

తనపై వచ్చిన ఆరోపణలు తొలగిపోయాకే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటానని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్ రావు తెలిపారు.అప్పటివరకు పార్టీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు బీజేపీ అధ్యక్షులు లక్ష్మణ్, ఇన్‌చార్జ్ కృష్ణదాస్‌కు లేఖ రాశారు. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా తాను ఈ నిర్ణయం తీసుకున్నానని కావున తన నిర్ణయాన్నిస్వాగతించాలని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా రఘునందనరావుపై అత్యాచారం కేసు నమోదైన విషయం అందరికి విదితమే. గత 12 ఏళ్లుగా రఘునందనరావు బలవంతంగా తనపై అత్యాచారం చేస్తున్నాడని, జ్యోతినగర్‌కు చెందిన ఓ వివాహిత సైబరాబాద్ పోలీస్‌ కమిషనర్ సజ్జనార్‌కు ఫిర్యాదు చేసింది.కమిషనర్ ఆదేశాలతో రామచంద్రాపురం పీఎస్‌లో రఘునందన్‌రావుపై అత్యాచారం, బెదిరింపులు, ప్రాణహాని తదితర సెక్షన్ల కింద కేసు నమోదైంది.

Advertisement

Next Story

Most Viewed