- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సలాం నీకు పోలీసు అన్న… రఘు కుంచె సాంగ్
కరోనా అంటే ప్రజల్లో భయం ఉంది. మరికొందరిలో అంతే మోతాదులో నిర్లక్ష్యం ఉంది. అలాంటి వారి నుంచి జాగ్రత్తగా ఉంటున్న వారికి కూడా వైరస్ సోకే ప్రమాదం ఉంది. చాలా మంది మరణించే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితులు తలెత్తకుండా ఉండాలనే… పోలీసులు తిండి తిప్పలు లేక, పగులు రాత్రి తేడా లేక… వీధుల్లోనే ఉంటున్నారు. కనీసం పుట్టిన బిడ్డ, కట్టుకున్న భార్యను చూసి.. ప్రేమగా దగ్గరకు కూడా తీసుకోలేక బాధపడుతున్నారు. అయినా సరే … ప్రజెంట్ సార్..అంటూ విధులకు హాజరవుతునే ఉన్నారు. బాధ్యతగా రెండు లాఠీ దెబ్బలు కొట్టైనా సరే… మనల్ని కాపాడుకునేందుకే తపన పడుతున్నాడు.
వారి త్యాగాలను చాటి చెప్తూ … పాట రూపంలో ధన్యవాదాలు తెలిపారు మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచే. పోలీసులు వారి జీవితాలను రిస్క్ లో పెట్టి..ధైర్యంగా, నిస్వార్థంగా సేవలు అందించడం… ముఖ్యంగా ప్రజల రక్షణ కోసం వారు పడే తపనకు సలాం చెబుతూ… పాటను కంపోజ్ చేసి పోలీసులకు అంకితమిచ్చారు.
సలాం నీకు పోలీసు అన్న..రెండు చేతులెత్తి నీకు మొక్కలన్నా… సలాం నీకు పోలీసు అన్న… కళ్ల ముందున్న దేవుడు నువ్వే అన్న… రేయి పగలు తేడా లేక ఊరు వాడా తిరుగుతున్నావు.. కంటిమీద కునుకు లేక కర్తవ్యం బోధిస్తున్నవు.. అంటూ సాగే పాటలో… పోలీసుల కష్టాలు వినిపించారు రఘు కుంచె. బండి సత్యం లిరిక్స్ అందించిన పాట… జనాన్ని ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా రఘు కుంచె వాయిస్ లోని ఎమోషన్ గురించి ప్రశంసలు అందుకుంటున్నారు. ఈ పాట ద్వారా పోలీసుల పట్ల ఉన్న నెగిటివిటి పోయి… గౌరవం పెరిగిందని చెప్తున్నారు నెటిజన్లు. పోలీసులకు సలాం చేస్తూ పాట రిలీజ్ చేసిన రఘు కుంచె… తర్వాత డాక్టర్లు, పారిశుధ్య కార్మికులపై పాట రిలీజ్ చేయనున్నారట.
Tags : Raghu kunche, Bandi Satyam, Tollywood, CoronaVirus Covid19