టీజీపీఎస్సీ పంపిన పరువు నష్టం నోటీసులకు బీఆర్ఎస్ నేత స్ట్రాంగ్ రిప్లై

by Ramesh Goud |   ( Updated:2025-04-14 12:22:51.0  )
టీజీపీఎస్సీ పంపిన పరువు నష్టం నోటీసులకు బీఆర్ఎస్ నేత స్ట్రాంగ్ రిప్లై
X

దిశ, వెబ్ డెస్క్: టీజీపీఎస్సీ(TGPSC) పంపిన నోటీసులకు బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డి (BRS Leader Enugula Rakesh Reddy) స్పందించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. నోటీసులకు త్వరలోనే సమాధానం ఇస్తానని అన్నారు. ఈ సందర్భంగా ఆయన.. అన్యాయాన్ని ఎదిరించడమే నేరమైతే ఆ నేరం మళ్ళీ మళ్ళీ చేస్తానని అన్నారు. జైల్లో బంధిస్తే జైలు గోడల మీద నా రాజు తరతరాల బూజు అని ధిక్కార స్వరాన్ని వినిపించిన కవి దాశరథి (Poet Dhasharathi) గారు పుట్టిన ఓరుగల్లు (Warangal) నేల పై పుట్టిన బిడ్డను అని, ఇలాంటి నోటీసులకు భయపడేది లేదని అన్నారు. గ్రూప్ -1 పరీక్షలో జరిగిన అవకతవలకు పై ప్రభుత్వాన్ని, టీజీపీఎస్సీని సహేతుకంగా ప్రశ్నించినందుకు నాపై పరువునష్టం దావా వేశారని తెలిపారు.

ప్రశ్నిస్తేనే పరువు పోతే మరి, మీవల్ల జరిగిన అవకతవకల వల్ల జీవితాలను కోల్పోతున్న నిరుద్యోగులు ఏం చేయాలి? అని ప్రశ్నించారు. అంతేగాక గతంలో నేడు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఇదే టీఎస్‌పీఎస్సీ పైన రోడ్డెక్కి ఎన్నో విమర్శలు చేసారని, మరి అప్పుడెందుకు ఇలాంటి నోటీసులు ఇవ్వలేదు..? అని నిలదీశారు. బీఆర్ఎస్ పార్టీ (BRS Party)కి, నాయకత్వానికి కేసులు కొత్తకాదు.. పోరాటం కొత్తకాదు.. ఆ స్ఫూర్తితోనే విద్యార్థి, నిరుద్యోగుల పక్షాన కొట్లాడుతామని, మీ ఇజ్జత్ దావాకు ఇగురంగానే త్వరలోనే సమాధానం ఇస్తాను అని రాకేష్ రెడ్డి రాసుకొచ్చారు. కాగా ఇటీవల విడుదలైన గ్రూప్ -1 ఫలితాల్లో అవకతవకలు జరిగాయని రాకేష్ రెడ్డి ఆరోపించారు. ఆరోపణలపై సీరియస్ అయిన టీజీపీఎస్సీ రాకేష్ రెడ్డి‌కి నోటీసులు జారీ చేసింది. టీజీపీఎస్సీపై చేసిన ఆరోపణలకు వారం రోజుల్లో సమాధానం చెప్పాలని, లేకుంటే పరువు నష్టం, క్రిమినల్ కేసులు దాఖలు చేస్తామని నోటీసుల్లో పేర్కొంది.



Next Story

Most Viewed

    null