రోడ్డుపై ఇసుక.. అదుపుతప్పి ట్రాక్టర్ కింద పడి వ్యక్తి మృతి

by Aamani |
రోడ్డుపై ఇసుక.. అదుపుతప్పి ట్రాక్టర్ కింద పడి వ్యక్తి మృతి
X

దిశ, ఊట్కూర్ : అత్త మామ ఇంటికి వెళ్తుండగా ట్రాక్టర్ కిందపడి మృతి చెందిన సంఘటన మండల సమీపంలోని కర్ణాటక ప్రాంతంలో శనివారం సాయంత్రం జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. మక్తల్ నియోజకవర్గానికి సంబంధిత ఓ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ట్రాక్టర్ ను తీసుకొని సింగారం గ్రామంలోని ఓ దేవాలయంలో పూజలు నిర్వహించుకొని కర్ణాటక మీదుగా సొంత గ్రామానికి వెళ్తున్నాడు. సైదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యల్పెటి గ్రామానికి చెందిన భార్యాభర్తలు కర్ణాటక బార్డర్ లో ఉన్న సంక్లపూర్ లో ఆదివారం ఓ ఫంక్షన్ కొరకు ద్విచక్రంపై వెళ్తుండగా రోడ్డుపై ఇసుక వేయడంతో అదుపుతప్పి ట్రాక్టర్ కింద భర్త పడగా భార్య గాల్లోకి ఎగిరి పక్కకు పడింది. దీంతో భర్త అక్కడికక్కడే మృతి చెందగా.. భార్యకు స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న భార్య కుటుంబ సభ్యులు.. చుట్టు ప్రక్కల గ్రామాల వారు ఆ ప్రాంతానికి చేరుకోవడంతో విషాద ఛాయలు అల్లుకున్నాయి. అయితే ట్రాక్టర్ డ్రైవర్ అక్కడి నుండి పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది.. సైదాపూర్ పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకున్నట్లు సమాచారం.

Next Story

Most Viewed