- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాఫెల్ విమానాలు వచ్చేస్తున్నాయ్
న్యూఢిల్లీ: రాఫెల్ యుద్ధ విమానాలు రేపు ఫ్రాన్స్ నుంచి బయల్దేరనున్నాయి. డస్సాల్ట్ ప్రొడక్షన్ ఫెసిలిటీ ఉన్న మెరిగ్నాక్ నుంచి బయల్దేరి బుధవారానికి భారత్ చేరనున్నాయి. చైనాతో సరిహద్దు ఘర్షణల నేపథ్యంలో రాఫెల్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్టులు ఇండియా చేరడంపై చర్చలు జరుగుతున్నాయి. ఈ రాఫేల్ విమానాలు కేవలం వారం రోజుల వ్యవధిలోనే అవసరాల మేరకు వినియోగించేలా సంసిద్ధంగా ఉంటాయని సమాచారం.
ఈ యుద్ధ విమానాల కోసం ఇప్పటికే 12 పైలట్లకు శిక్షణ పూర్తయింది. మరికొందరు ఇంకా ఫ్రాన్స్‌లో శిక్షణ పొందుతున్నారు. ఎన్ని యుద్ధ విమానాలు బయల్దేరతాయో సోమవారమే తెలుస్తుందని వైమానిక దళవర్గాలు తెలిపాయి. ఇవి బుధవారం ఇండియా చేరుకుంటాయని, అయితే, ఐదు లేదా ఆరు విమానాలు రావొచ్చని వివరించాయి. ఈ యుద్ధ విమానాలు గేమ్ చేంజర్‌గా నిపుణులు పేర్కొంటున్నారు. వీటిని ఎదుర్కొనే సామర్థ్యం అటు చైనాకు గానీ, ఇటు పాకిస్తాన్‌కు గానీ లేదని వివరించారు.