‘రాధే శ్యామ్‌’కు కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్

by Jakkula Samataha |   ( Updated:2021-02-11 06:28:45.0  )
‘రాధే శ్యామ్‌’కు కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్
X

దిశ, సినిమా : ప్రభాస్, పూజా హెగ్డే జంటగా తెరకెక్కిన రొమాంటిక్ పీరియాడికల్ లవ్ స్టోరీ ‘రాధే శ్యామ్’ నుంచి ఫిబ్రవరి 14న టీజర్ రాబోతున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన పనులు ఆల్రెడీ పూర్తి కాగా.. ఫ్యాన్స్ ఎగ్జైటింగ్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇక ఇప్పటికే రిలీజైన ‘బీట్స్ ఆఫ్ రాధే శ్యామ్’ ఆడియన్స్‌ను ఆకట్టుకోగా.. జస్టిన్ ప్రభాకరన్ మ్యూజిక్‌కు మంచి మార్కులే పడ్డాయి. పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా వస్తున్న ఈ సినిమా హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కాబోతుండగా.. హిందీ వెర్షన్ మ్యూజిక్‌కు మిథున్, మనన్ భరద్వాజ్ సంగీతం అందించనున్నట్లు ప్రకటించారు మేకర్స్. సౌత్ ఇండస్ట్రీకి సంబంధించిన మ్యూజిక్‌ను జస్టిన్ ప్రభాకరన్ కంపోజ్ చేస్తారని తెలిపారు. టి సిరీస్, గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమాకు రాధాకృష్ణ కుమార్ దర్శకులు.

https://twitter.com/UV_Creations/status/1359819502674796546?s=20

Advertisement

Next Story