నా కోసం ప్రార్థించండి : బాలీవుడ్ హీరోయిన్

by Shyam |
నా కోసం ప్రార్థించండి : బాలీవుడ్ హీరోయిన్
X

కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో.. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు సైతం కొవిడ్ 19 బారిన పడి నరకయాతన అనుభవిస్తున్నారు. తాజాగా బిగ్ బీ అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్, ఆరాధ్య బచ్చన్‌లకు కూడా కరోనా సోకగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యాధికారులు వెల్లడించారు. ఇదిలా ఉంటే, మరో బాలీవుడ్ సెలబ్రిటీకి కరోనా సోకినట్లు తెలిసింది. హీరోయిన్ రాచెల్ వైట్‌కు కరోనా పాజిటివ్ వచ్చినట్లు ప్రకటించింది. జులై 11న తనకు కరోనా సోకినట్లు తెలిపిన రాచెల్.. హోం క్వారంటైన్‌లో ఉన్నట్లు చెప్పింది. తను త్వరగా రికవరీ కావాలని దేవుడిని ప్రార్థించాలని అభిమానులను కోరింది.

కాగా, రాచెల్ 2014లో రిలీజ్ అయిన ‘మంకథ’ సినిమాతో ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టగా.. ఉంగ్లీ సినిమా ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. 2019లో వచ్చిన ‘థాయ్ కర్రీ’ చిత్రంలో చివరగా కనిపించింది రాచెల్ వైట్.

https://twitter.com/whitespeaking/status/1282012486267437057?s=20

Advertisement

Next Story

Most Viewed