కనువిందు చేస్తున్న రాచకొండ జలపాతం

by Shyam |
కనువిందు చేస్తున్న రాచకొండ జలపాతం
X

దిశ, మునుగోడు: గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో రాచకొండలో జలపాతాలు కనువిందు చేస్తున్నాయి. యాదాద్రి-భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల పరిధిలోని పల్లగట్టుతండ సమీపంలో ఎత్తయినకొండల మధ్య నుండి జాలువారుతున్న నీటితో జలపాతాలను తలపిస్తున్నాయి. రాచకొండ ప్రాంతంలో ఎత్తయిన కొండలు ఉండటంతో వాటి నుండి జాలువారే నీటితో ఇక్కడ అనేక జలపాతాలు ఏర్పడుతున్నాయి.

గత సంవత్సరం నవంబర్ లో కురిసిన వర్షాలతో మొదటిసారిగా స్థానికులు అక్కడ దిగిన ఫొటోలోను సోషల్ మీడియాలో పెట్టగా దాంతో సరిహద్దు జిల్లాలైన రంగారెడ్డి, నల్లగొండ, హైదరాబాద్ లాంటి నగరాల నుండి కూడా ఇక్కడికి భారీ ఎత్తులో పర్యాటకులు వచ్చివెళ్లారు. మళ్ళీ గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఈ జలపాతం కనువిందు చేస్తూ ఉండడంతో పర్యాటకుల తాకిడి ప్రారంభమైంది. గతంలో ఈ జలపాతం వద్ద ప్రమాదం జరిగి ఒకరు మృతి చెందడంతో అటవీశాఖ అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో కనీస సౌకర్యాలు ఏర్పాటు చేసి అభివృద్ధి చేస్తే పర్యాటకుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు.

Advertisement

Next Story