- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈటలకు ఊహించని షాక్.. రంగంలోకి ఆర్.కృష్ణయ్య
దిశ, వెబ్‌డెస్క్: హుజురాబాద్ ఉప ఎన్నిక సమీపిస్తోన్న తరుణంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎల్బీనగర్ మాజీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హుజురాబాద్‌లోనే కాదు.. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా బీజేపీ దోపిడీని ఎత్తిచూపిస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అవినీతి పాలనపై దేశవ్యాప్తంగా దండోరా వేస్తామని వెల్లడించారు. బీసీలకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. బీసీలకు 50 శాతం రిజర్వేషన్ల సాధనకై త్వరలో ఉమ్మడి రాష్ట్రంలో చైతన్యయాత్ర చేపట్టి దేశవ్యాప్త ఉద్యమాన్ని ప్రారంభిస్తామని అన్నారు. 70 ఏళ్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, వివిధ రాజకీయ పార్టీలు బీసీలను భిక్షగాళ్లుగా చేశారని మండిపడ్డారు. ఇప్పటికీ చట్టసభల్లో రిజర్వేషన్లు లేవన్నారు. కాగా, ఈ నేపథ్యంలో బీజేపీ అభ్యర్థిగా హుజురాబాద్ బరిలో నిలిచిన ఈటల రాజేందర్‌కు ఊహించనని షాక్ తగిలినట్లైంది. ఆర్.కృష్ణయ్య వ్యాఖ్యలతో బీసీ ఓట్లపై ఆందోళన చెందాల్సిన పరిస్థితి నెలకొంది.