టార్గెట్ రూ.48 కోట్లు.. వసూలు చేసింది 30.7 కోట్లు

by Shyam |
టార్గెట్ రూ.48 కోట్లు.. వసూలు చేసింది 30.7 కోట్లు
X

దిశ, కుత్బుల్లాపూర్: పన్ను వసూళ్లలో కుత్బుల్లాపూర్​ సర్కిల్​ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. టార్గెట్​కు చేరువలో దూసుకెళ్తుంది. 2020–21 ఆర్థిక సంవత్సరం ఆస్తి పన్ను వసూళ్లలో తన మార్క్​ను చాటుకుంటుంది. ఉప కమిషనర్​ మంగతాయారు ఆధ్వర్యంలో పన్ను వసూళ్లలో వేగం పెంచారు. సర్కిల్​ పరిధిలో నివాస, వ్యాపార గృహ సముదాయాలు మొత్తంగా 52వేల పైచిలుకు ఉన్నాయి. సుమారు రూ.48కోట్ల పన్ను వసూలు టార్గెట్​ కాగా, ఇప్పటికే రూ.30.7కోట్ల పన్నులు వసూలు చేశారు. అధికారులు స్పెషల్​ డ్రైవ్​చేపట్టి ప్రజలకు అవగాహన కల్పించడంలో సఫలీకృతమయ్యారు. మొండి బకాయిలపై దృష్టి సారించి నోటీసులు సైతం జారీ చేస్తున్నారు. త్వరలోనే వందశాతం పన్ను వసూలు దిశగా సర్కిల్​ పయనిస్తోంది.

2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తి పన్ను వసూళ్లలో కుత్బుల్లాపూర్ సర్కిల్ దూసుకుపోతోంది. ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు రూ.48 కోట్ల టార్గెట్ ను పూర్తి చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఉప కమిషనర్ మంగతాయారు ఆధ్వర్యంలో అధికారులు, సిబ్బంది ప్రత్యేక బృందాలుగా ఏర్పడి పన్నులు రాబట్టేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి సఫలీకృతులవుతున్నారు. సర్కిల్ పరిధిలో 46,291 నివాస గృహాలు, 5,695 వ్యాపార సముదాయాలతో పాటు 1,006 ఇతర నిర్మాణాలున్నాయి. మొత్తం 52,992 నివాసాలున్నట్లు అధికారులు వెల్లడించారు. రూ.48 కోట్ల టార్గెట్ లో ఇప్పటికే రూ.30.7 కోట్ల పన్నులు వసూలు చేశారు. మిగతా పన్నులను సైతం వసూలు చేయడంతో పాటు ఎర్లీబర్డ్ స్కీంలో ముందస్తు పన్నులు వసూలు చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు.

పన్నులు చెల్లించకుంటే జప్తు

ఉన్నతాధికారుల సూచన మేరకు పన్ను వసూలు చేస్తున్నాం. ఇప్పటి వరకు మా కార్యాలయ అధికారులు, సిబ్బంది చొరవతో వసూళ్లు వేగవంతం చేశాం. మొండి బకాయిదారుల్లో 900 మంది వరకు రెడ్ నోటీసులు అందజేశాం. కొందరు వచ్చి చెల్లిస్తున్నారు. పన్నులు చెల్లించని వారిని గుర్తిస్తాం. పన్ను చెల్లించకుంటే ఆస్తుల జప్తునకు వెనకాడేదిలేదు.

–మంగతాయారు, కుత్బుల్లాపూర్ సర్కిల్ డీసీ

Advertisement

Next Story