షూటింగ్ స్పాట్‌లో ‘పుష్ప’

by Jakkula Samataha |
షూటింగ్ స్పాట్‌లో ‘పుష్ప’
X

దిశ, వెబ్‌డెస్క్ : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’కు ఫైనల్‌గా ముహూర్తం కలిసొచ్చింది. ఈ రోజు నుంచి షూటింగ్ మొదలైంది. బన్నీ ‘అల వైకుంఠపురంలో’ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ప్రకటించిన ఈ చిత్ర షూటింగ్ వెంటనే షురూ చేయాల్సి ఉన్నా, ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే వస్తోంది. కరోనా కారణంగా చాలా గ్యాప్ తీసుకున్న సినిమా యూనిట్.. చివరికి ఈ రోజు చిత్రీకరణ ప్రారంభించింది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ కోసం కేరళ, తిరుపతి అంటూ ఎన్నో స్పాట్ల పేర్లు తెరపైకి వచ్చినా.. చివరగా తూర్పుగోదావరి జిల్లా, మారేడిమిల్లి డీప్ ఫారెస్ట్‌లో ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ అయింది.

మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమాలో బన్నీ సరసన రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, నారా రోహిత్ ఓ కీలక పాత్రలో నటించబోతున్నాడని సమాచారం. రివేంజ్ డ్రామాగా రాబోతున్న ఈ సినిమాలో రోహిత్‌ది కథను మలుపు తిప్పే పాత్ర అని తెలుస్తోంది.

Advertisement

Next Story