- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
విద్యార్థుల హక్కులను హరించే ఓయూ సర్క్యులర్!

విద్యార్థులు తమ సమస్యలపై నిరసన తెలపడం, పలు ప్రజా సమస్యలపై గొంతెత్తటం సర్వ సాధారణం. ఎన్నో ఉద్యమాలు, పోరా టాలకు కేంద్రమైన ఓయూలో ధర్నాలు, సభలు, సమావేశాలు నిషేధిస్తూ ఓయూ అధికారులు ఈ నెల 13న తీసుకొచ్చిన ఉత్తర్వులు విద్యార్థుల స్వేఛ్చకు గొడ్డలి పెట్టుగా మారాయి. ఓయూ తీసుకున్న నిర్ణయాన్ని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ నిర్ణయం అమలు పరిస్తే ఉస్మానియాలో సామాజిక, రాజకీయ అస్తిత్వ ఉద్యమాలకు సంకెళ్లు వేయటమే అవుతుంది. 107 ఏళ్ల చరిత్ర కలిగిన ఓయూలో ఇదొక దుర్దినంగా భావిస్తున్నాం.
విద్యార్థుల సమస్యలు పరిష్కరించటంలో విఫలమైన ఓయూ అధికార యంత్రాంగం.. విద్యార్థుల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే ఆందోళనలు, ధర్నాలను నిషేధిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఇది విద్యార్థి లోకం తీవ్రంగా నిరసిస్తోంది. ఇప్పటికైనా ఉపకులపతి వెంటనే సర్క్యులర్‌ను వెనక్కి తీసుకొవాలి. ముందు యూనివర్సిటీ అభివృద్ధి కోసం కృషి చేస్తూ యూనివర్సిటీలో బోధన సిబ్బందిని నియమించే విధంగా, పెండింగ్‌లో ఉన్న విద్యార్థుల స్కాలర్ షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేసే విధంగా కృషి చేయాలి. యూనివర్సిటీలో భోజనం, హాస్టల్ వసతి దయనీయ స్థితిలో బ్లేడ్స్‌తో భోజనం, పురుగుల అన్నం నాసిరకమైన భోజనం పెడుతున్నారు. పేద, ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతున్నారు. వారికి నాణ్యమైన విద్య, భోజనం, అడ్మిషన్ పొందిన ప్రతి విద్యార్థికి హాస్టల్ వసతి కల్పించే విధంగా యూనివర్సిటీకి రావాల్సిన నిధులు ప్రభుత్వం నుండి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. కానీ అకడమిక్ వాతావరణం నెలకొల్పేందుకే ఈ నిర్ణయం అని చెప్పడం బూటకం.
దివ్యాంగ విద్యార్థులపై కేసులు..
ఓయూ వైస్ ఛాన్సలర్‌గా ప్రొఫెసర్ కుమార్ పదవి బాధ్యతలు స్వీకరించి ఐదు నెలలు గడుస్తుంది. కానీ విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యారు... విద్యార్థులు తమ సమస్యలు చెప్పుకోవాలంటే అపాయింట్మెంట్ తీసుకుని రావాలని చెప్పారు. అపాయింట్మెంట్ అడిగితే గత రెండు నెలలుగా ఏ విద్యార్థికి, విద్యార్థి సంఘానికి అపాయింట్మెంట్ ఇవ్వకుండా నియంతృత్వంగా వ్యవహరిస్తూ ప్రశ్నించిన విద్యార్థులు, విద్యార్థి నాయకులపైన ఓయూ సెక్యూరిటీ సిబ్బంది, పోలీసులతో దాడులు జరిపిస్తూ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారు. ఇక ఉస్మానియా పేరుకే ప్రభుత్వ యూనివర్సిటీ ఫీజులు మాత్రం ప్రైవేటు యూనివర్సిటీని తలదన్నే రీతిలో తెలంగాణలో ఏ యూనివర్సిటీలో లేని విధంగా మూడింతలు విద్యార్థుల నుండి వేలాది రూపాయల పరీక్ష ఫీజులను వసూలు చేస్తున్నారు. యూనివర్సిటీ అధికార యంత్రాంగం కేవలం ధనార్జనే ధ్యేయంగా పని చేస్తున్నట్టు స్పష్టంగా అర్థం అవుతుంది. దివ్యాంగ పరిశోధక విద్యార్థులు అక్రమంగా తమ నుంచి మెస్ బిల్లులు వసూలు చేయడాన్ని నిరసిస్తూ వీసీ ఛాంబర్‌లో నిరసన వ్యక్తం చేస్తున్న వారిని అక్రమంగా అరెస్ట్ చేసి అఫ్జల్‌గంజ్ పోలీస్ స్టేషన్‌కి తరలించడమే కాకుండా వారిపై అక్రమ కేసులు పెట్టడం రాక్షస పరిపాలనను తలపిస్తుంది.
అకడమిక్ వాతావరణాన్ని సరిదిద్దాలి!
విశ్వవిద్యాలయాల్లో గాడి తప్పిన అకడమిక్ వాతావరణాన్ని సరిదిద్దాలి. యూనివర్సిటీలో అశాస్త్రీయంగా వందల రెట్లు పెంచిన పరీక్షా ఫీజు, పీజీ, ఇంజనీరింగ్ కోర్సుల ట్యూషన్ ఫీజులను తగ్గించాలి. సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులను తక్షణమే రెగ్యులరైజ్ చేయాలి. పీజీ, పీహెచ్డీ విద్యార్థులకు ఫెలోషిప్స్ ఇవ్వాలి. విద్యార్థినీ, విద్యార్థుల సంఖ్యకనుగుణంగా నూతన హాస్టల్ భవనాలను తక్షణమే నిర్మించాలి. యూనివర్సిటీ విద్యార్థులందరికీ హెల్త్ కార్డు సదుపాయం పునరుద్ధరించాలి. యూనివర్శిటీల్లో ప్రజాస్వామిక వాతావరణం నెలకొల్పేందుకు స్టేట్ యూనివర్సిటీలలో విద్యార్థి సంఘాల ఎన్నికలు నిర్వహించాలి. ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రతిష్టను నిలబెట్టాలి. ఇందుకోసం విద్యార్థి సంఘా లుగా సంపూర్ణ సహకారం అందించేందుకు సిద్ధంగా ఉంటాం. రాజ్యాంగ విరుద్ధమైన నిర్ణయాలు తీసుకొని జీవోలను విడుదల చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నాం. ఓయూ విడుదల చేసిన ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.
జీవన్
రీసెర్చ్ స్కాలర్, ఓయూ,
88850 99930
- Tags
- Osmania Circular